-జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శాలను అనుసరిద్దాం- గద్దె రామ్మోహన్రావు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు
-ప్రజలకు 15 రోజులుగా నిరంతరాయంగా విస్తృతంగా అవగాహన కల్పించిన స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం – ధ్యానచంద్ర, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచానికే దిశ నిర్దేశించే సామర్థ్యం విజయవాడకు ఉందని స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన. విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం బెంజ్ సర్కిల్ నందుగల పింక్ టాయిలెట్స్ దగ్గర ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, తూర్పు నియోజకవర్గ సభ్యులు గద్దె రామ్మోహన్రావు, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని, అక్కడున్న ప్రజలకు స్వచ్ఛత హి సేవ మీద అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజనా మాట్లాడుతూ గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్వచ్ఛ సంకల్పంతో ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి రాష్ట్రంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా గమనించదగ్గ మార్పులు ప్లాస్టిక్ నిషేధం, చెత్తబుట్ట లోనే చెత్త వేయడంమనము, పరిసరాల శుభ్రత, నగర సుందరీ కరణ లాంటివి ఎన్నో చూసామని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత హి సేవా కార్యక్రమం సంపూర్ణమవుతుందని, వ్యవస్థ వైపు నుండి ప్రజలకు ఎటువంటి సహాయం కావాలన్న తప్పకుండా అందజేస్తారని, ప్రజలు కూడా తమ వంతు కృషిని అందించాలని అన్నారు. విజయవాడ చాలా విషయాల్లో చైతన్యవంతమైన నగరం అని, ప్రపంచానికే దిశ నిర్దేశించే సామర్థ్యం ఉందని అందులో భాగంగా పింక్ టాయిలెట్స్ వార్షికోత్సవం సందర్భంగా, నగరంలో మరిన్ని పింక్ టాయిలెట్స్ రావాలని ఆశిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ గాంధీజీ గారి ఆశయం స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత వల్ల ఆరోగ్యానికే కాదు నగరానికి తద్వారా రాష్ట్రానికి తద్వారా దేశానికి పరిశుభ్రమైన దేశంగా గర్వకారణం, స్వచ్ఛభారత్ మొదలై 10 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో విజయవాడ నగరపాలక సంస్థ వారు నిర్వహిస్తున్న స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత మీద ప్రజలకు తెలిసేలా చేయటం ఒక మంచి పద్ధతిని తెలిపారు. గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ, మనీ స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా పింక్ టాయిలెట్స్ లాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అందుబాటులోకి తీసుకొచ్చేటట్టు చేస్తామని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతహి సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ, స్వచ్ఛత అడుగుజాడల్లో ప్రజలందరూ ఉండాలని అన్నారు.
ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ స్వచ్ఛభారత్ 2014 నా మొదలైందని 2024 అక్టోబర్ రెండుకి 10 సంవత్సరాల పూర్తయిన సుఖ సందర్భంలో విజయవాడ నగరపాలక సంస్థ ఈ సంవత్సరం స్వచ్ఛత ఈ సేవ ఘనంగా నిర్వహించిందని అందులో భాగంగా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 1 వరకు నిరంతరాయంగా ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వాళ్లకి అవగాహన కల్పించడమే కాకుండా వ్యాసరచన పోటీలు, వ్యక్తిత్వ పోటీలు, డ్రాయింగ్ పోటీలు, మురికివాడలను అందమైన వాడలుగా మార్చేందుకు కోడల మీద పెయింటింగ్, మొక్కలు నాటడం, ప్రజల భాగస్వామ్యంతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం, రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ వాటిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడమే కాకుండా ప్రజలను భాగస్వామం చేస్తూ వాళ్ళని అటువంటి వస్తువులను తయారు చేసే విధంగా ప్రోత్సహించటం లాంటి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అందులో భాగంగానే పింక్ టాయిలెట్ వద్ద ప్రజలకు స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా వీటిపై మరింత అవగాహన కల్పించి మరుగుదొడ్ల నిర్వహణ మరుగుదొడ్ల వాడకం మరియు పింక్ టాయిలెట్ ల గురించి ప్రజలకు తెలియపరచటమే ఈ కార్యక్రమముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ప్రజలు ఆడవాళ్ళు పింక్ టాయిలెట్స్ వాళ్లకు ఎలా ఉపయోగపడాయి సమాజంలో వాళ్లకంటూ ఒక సెక్యూరిటీని ఏర్పరచడంలో పింకు టాయిలెట్స్ ప్రాముఖ్యతను కలెక్టర్ గారితో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చిన్నపాటి ఉషారాణి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నవళి, జోనల్ కమిషనర్ ప్రభుదాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ బాబు శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్లు సెక్రెటరీలు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News