విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా నాలుగవ రోజు అనగా ఆదివారం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మరియు సెకండరీ గ్రేడ్ ప్రత్యేక ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 38544 మందికి గాను 32533 మంది అభ్యర్థులు అనగా 84.40 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 92 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మరియు సెకండరీ గ్రేడ్ ప్రత్యేక ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 22492 మందికి గాను 18955 మంది అనగా 84.27 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 82 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పరీక్షలకు 16052 మందికి గాను 13578 మంది అనగా 84. 59 శాతం మంది హాజరయ్యారు. నాలుగవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతం గా ముగిసాయి. మైనర్ మీడియా మరియు తెలుగు స్కూల్ అసిస్టెంట్ భాషోపాధ్యాయుల రెస్పాన్స్ షీట్లను వెబ్సైటులో ఉంచారు. వీటిపై అభ్యర్థుల నుండి అభ్యంతరాలను 9వ తేదీ వరకు స్వీకరిస్తారని అని ఏపీ టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణా రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేసారు
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …