Breaking News

21,768 మంది వ‌ర‌ద బాధితుల బ్యాంకు ఖాతాల్లో పొర‌పాట్లు

-స‌రిచేసి నేటి నుండి వారి ఖాతాల్లో వ‌ర‌ద సాయం జ‌మ‌
-వెల్ల‌డించిన అధికారులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవ‌ల విజయవాడ వ‌ర‌ద‌ల్లో తీవ్రంగా న‌ష్ట‌పోయిన వ‌ర‌ద బాధితుల్లో 21,768 మంది బాధితులు త‌మ బ్యాంకు ఖాతాల‌ను త‌ప్పుగా న‌మోదు చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు. వాటిని మ‌ళ్లీ క్షేత్ర‌స్థాయిలో బాధితుల‌తో త‌నిఖీ చేసి స‌రిచేశారు. ఈ బాధితులంద‌రికీ సోమ‌వారం సాయంత్రానికి వారందరి ఖాతాల్లోకి వ‌ర‌ద సాయం జ‌మ చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. వీరి ఖాతాల్లోకి మొత్తం రూ.18,69,89,000ల సొమ్ము జ‌మ చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ అధికారులు తెలిపారు. వ‌ర‌దల్లో న‌ష్ట‌పోయిన బాధిత ప్ర‌తి కుటుంబానికి ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రిగా సాయం అందించాల‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చార‌ని, ఆ ప్ర‌కారం ప్ర‌తి ఒక్క‌రికీ సాయం అందుతుంద‌ని చెప్పారు. బాధితులెవ్వ‌రూ అందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని వెల్ల‌డించారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *