-ఐదేళ్ళలో 50 లక్షల ఎకారాలను ప్రకృతి సేద్యం కిందకు తేవాలని లక్ష్యం
-వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలి
-ఎంఎస్ఎంఇ రంగం ప్రోత్సాహానికి బ్యాంకులు ముందుకు రావాలి
-సాంకేతికతను జోడించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పధకాలను ముందుకు తీసుకువెళ్ళాలి
-వరదల్లో బ్యాంకులు అందించిన తోడ్పాటుకు ప్రభుత్వం తరపున అభినందనలు
-రాష్ట్రస్థాయి బ్యాంకరుల కమిటీ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించుటలో బ్యాంకులు మానవతా దృక్పదంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ,పాడి పరిశ్రమాభివృద్ధి,మత్స్య శాఖామాత్యులు కింజరపు అచ్చన్నాయుడు విజ్ణప్తి చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 228వ రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ(SLBC) సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.2024 ఏడాది మొదటి త్రైమాసికానికి సంబంధించి అనగా జూన్ నెలాఖరు వరకు సాధించిన ప్రగతిని సమీక్షించేందుకు జరిగిన ఈసమావేశంలో గత ఎస్ఎల్బిసి సమావేశం మినిట్స్ ఆమోదించడం,బ్యాంకింగ్ కీ ఇండికేటర్స్,2024-25 మొదటి త్రైమాసిక బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక (ACP) లక్ష్య సాధన,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పధకాలు, ఫైనాన్సియల్ ఇన్ క్లూజన్,డిజిటల్ జిల్లాలు,ఆన్ గోయింగ్ క్యాంపెయిన్స్ ఆఫ్ ఇండియా మరియు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తదితర అజెండా అంశాలపై ఈసమావేశంలో చర్చించారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 65 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ,అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నా రని కావున ఈరంగాల్లో బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలని విజ్ణ్తప్తి చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కౌలు రైతులకు 9 లక్షల సిసిఆర్సి కార్డులు(Crop Cultivator Rights Card)ఇవ్వగా ఇప్పటి వరకూ 2లక్షల మందికి మాత్రమే రుణాలు అందిచారన్నారు.కౌలు రైతులకు రుణాలు అందించడంలో మానవతా దృక్పధంతో బ్యాంకులు ముందుకు రావాలని ఆయన పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఎకరాలను ప్రకృతి సేద్ధం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కువ మంది జనాభా వ్యవసాయ,అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న నేపధ్యంలో ఆయా రంగాల్లో అవసరమైన రుణాలను అందించాలని కోరారు.ప్రభుత్వం ఆరు రంగాల్లో విధాన నిర్ణయాలను ప్రకటించిందని వాటిలో ఎంఎస్ఎంఇ రంగం ప్రధానమైన రంగమని దీనిని ప్రోత్సహించేందుకు బ్యాంకులు అన్ని విధాలా ముందుకు రావాలని విజ్ణప్తి చేశారు.రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్రతీరంతో పాటు అపారమైన సహజ వనరుల తోపాటు తగిన యుతవ ఉందని కావున వివిధ రంగాల్లో వారికి చేయూతను అందించేందుకు బ్యాంకులు అన్ని విధాలా ముందుకు రావాలని మంత్రి విజ్ణప్తి చేశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పియం ముద్రా యోజన,పియం విశ్వకర్మ తదితర పధకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దిశిస్తోందని అయితే క్షేత్ర స్థాయిలో ఆయా పధకాలపై ప్రజలకు తగిన అవగాహన లేకపోవడంతో అవి సక్రమంగా అమలు కావడం లేదని కావున వాటిపై ప్రజలకు తగిన అవగాహన కల్పించి విజయవంతానికి కృషి చేయాలని మంత్రి విజ్ణప్తి చేశారు.
గత ప్రభుత్వం వివిధ రంగాలకు కేటాయించిన నిధులను వేరే అవసరాలకు మళ్ళించి ఆయా రంగాలన్నిటినీ నిర్వీర్యం చేసి అభివృద్ధిని నిలిపి వేసిందని మరలా వాటన్నిటినీ ఒక్కక్కటిగా గాడిలో పెట్టేందుకు గత నాలుగు నెలలుగా ఈప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అబివృద్ధి సంక్షేమ పధకాలకు సాంకేతికతను జోడించి వాటిని ముందుకుకు తీసుకువెళ్ళేందుకు బ్యాంకులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని మంత్రి అచ్చన్నాయుడు విజ్ణప్తి చేశారు.ఇటీవల వరదల్లో బాధితులను ఆదుకునేందుకు బ్యాంకులు కూడా ఎంతో తేడ్పాటును అందించాయని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అచ్చన్నాయుడు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి మరియు సిఇఒ ఎ.మణిమేఖలై (Ms.A Manimekhalai)మాట్లాడుతూ విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వర్ణ ఆంధ్ర @2047,అభివృద్ధి చెందిన ఎపి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక వినూత్న కార్యక్రమాలు,పధకాలను అమలు చేయడం పట్ల ముందుగా బ్యాంకులు అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.ముఖ్యంగా సొంకేతికత సహాయంతో సింపుల్ అండ్ ఎఫెక్టివ్ గవర్నైస్ విధానంతో ముందుకు వెళుతోందన్నారు.అదే విధంగా పి-4 విధానం(పబ్లిక్,ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్ షిప్)తో వివిధ రంగాల్లో అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.డిజిటల్ ఇనిషియేటివ్స్,మౌలిక సదుపాయాలు,ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నానికి బ్యాంకులు అందరి తరుపున రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహకారాన్ని అందిస్తామని చెప్పారు.ఇటీవల వరదల్లో బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని మణిమేఖలై ప్రత్యేకంగా అభినందించారు.
బ్యాంకుల పనితీరు గురించి ఆమె మాట్లాడుతూ 2024-25 వార్షిక రుణ ప్రణాళిక అమలుకు సంబంధించి ప్రాధాన్య రంగం కింద 3లక్షల 75వేల కోట్ల రూ.లు రుణాలు అందించాల్సి ఉండగా మొదటి త్రైమాసికంలో అనగా జూన్ 30 నాటికి లక్షా 36వేల 657 కోట్లు అనగా 36 శాతం రుణాలు అందించడం జరిగిందని ఎండి అండ్ సిఇఓ మణిమేఖలై తెలిపారు. అదే విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి 2లక్షల 64వేల కోట్లు అందించాల్సి ఉండగా 89వేల 438 కోట్లు అందించి 34 శాతం,ఎంఎస్ఎంఇ రంగం రంగం కింద 87వేల కోట్లు రుణ సహాయం చేయాల్సి ఉండగా 44వేల 150 కోట్ల రూ.లు అందించి 51 శాతం లక్ష్యాన్నిసాధించి నట్టు చెప్పారు.అలాగే ప్రాధాన్యేతర రంగం కింద లక్షా 65వేల కోట్లు అందించాల్సి ఉండగా 87వేల 731 కోట్లు రుణాలందించి 53 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు చెప్పారు.
ఈసమావేశంలో ఫైనాన్సియల్ సర్వీసెస్ శాఖ కార్యదర్శిగా ఢిల్లీలో రాష్ట్రం తరపున పనిచేస్తున్ననాగరాజు మద్దిరాల మాట్లాడుతూ వ్యవసాయ,ఎంఎస్ఎంఇ రంగాల్లో రుణ వసతి బాగుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం వివిధ ప్లాగ్ షిప్పు పధకాలైన పియం జన్ ధన్ యోజన, పియం జీవన్ జ్యోతి యోజన,పియం అటల్ ఫెన్సన్ యోజన,పియం ముద్ర యోజన వంటి పధకాలకు సకాలంలో తగిన రుణాలు అందించాలని సూచించారు.వార్షిక రుణ ప్రణాళిక అమలులో మెరుగైన వృద్ధి సాధించారని అన్నారు.విద్యా రుణాలు మంజూరులో ఎస్సి,ఎస్టి,బిసి లకు తగిన రీతిలో రుణాలు విడుదల కావడం లేదని వాటని మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు.వ్యవసాయేతర రంగాలైన మత్స్య,కోళ్ళ,డైరీ వంటి రంగాల్లో మరింత పెద్ద ఎత్తున రుణాలందించాలని సూచించారు.ఎపిలో ప్రకృతి సేద్యం ప్రగతి బాగుందని దీనిలో మరింత తోడ్పాటు అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుచేసే రైతుల్లో 90 శాతం వరకు కౌలురైతులు ఉన్నారని వారికి సక్రమంగా రుణాలు అందడం లేదని కావున సిసిఆర్సి కార్డులు కలిగిన కౌలు రైతులకు తప్పకుండా రుణాలు అందించి ఆదుకోవాలని బ్యాంకరులకు విజ్ణప్తి చేశారు.ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ మాట్లాడుతూ 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్టు చెప్పారు.అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పధకాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు.
అంతకు ముందు రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ కన్వీనర్ మరియు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సివిఎన్ భాస్కరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా వివరాలను తెలియజేస్తూ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక కింద జూన్ 30 నాటికి మొదటి త్రైమాసికంలో సాధించిన ప్రగతిని వివరించారు. అలాగే బ్యాంకింగ్ కీ ఇండికేటర్ల కింద వివిధ అడ్వాన్సులు,వడ్డీలేని రుణాలు,ఎంఎస్ఎంఇ రంగాలు సహా వివిధ ప్రాయోజిత పధకాలల్లో సాధించిన ప్రగతి తదితర అంశాలపై రంగాల వారీగా సాధించిన ప్రగతిని వివరించారు.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎపి రీజియన్ రీజనల్ డైరెక్టర్ ఎఓ బషీర్ మాట్లాడుతూ కన్జంప్సన్ రుణాలు విషయంలో బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.డిజిటల్ ట్రాన్సుఫార్మేషన్ కు సంబంధించి క్యూఆర్ కోడ్ ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.డిజిటల్ కరెన్సీకి సంబంధించి కాకినాడ,మచిలీపట్నం(కృష్ణా) రెండు జిల్లాల్లో ఫైలెట్ ప్రాజెక్టును ఆర్బిఐ ప్రారంభించిందని చెప్పారు.ఆర్బీఐ క్విజ్ పోటీలను నిర్వహించగా ఎపి నుండే ఎక్కువ మంది యువత పాల్గొన్నారన్నారు.నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్.రావత్ మాట్లాడుతూ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కు సంబంధించి రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో లక్ష్యాలను ఇవ్వగా వాటి సాధనకు కృషి చేయాలన్నారు.మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు రాష్ట్రానికి అన్ని విధాలా సహకారం అందించేందుకు నాబార్డు పూర్తిగా తోడ్పడుతుందని చెప్పారు.ఎపిలో ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పిఎసిఎస్)కంప్యూటరీ కరణ ప్రక్రియ బాగుందని పేర్కొన్నారు.సిడ్బి సిఎండి మనోజ్ మిట్టల్ మాట్లాడుతూ సిడ్బికి సంబంధించి ఎపిలో 4 బ్రాంచిలు పనిచేస్తున్నాయని పుడ్ ప్రాసెసింగ్ క్లష్టర్లకు,స్టార్ట్అప్ లకు తగిన తోడ్పాటును అందిస్తున్నట్టు తెలిపారు.
ఈసమావేశానికి తొలుత యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎజియం మరియు ఎస్ఎల్బిసి కోఆర్డినేటర్ రాజబాబు స్వాగతం పలికి అజెండా అంశాలను వివరించారు.
ఈసమావేశంలో చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత,పరిశ్రమలు,వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్,ఆర్ధికశాఖ కార్యదర్శి జానకి,అదనపు కార్యదర్శి జె.నివాస్ తదితర అధికారులు,వివిధ బ్యాంకుల డిజిఎంలు,ఎజియంలు,ఎల్డిఎంలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫైనాన్షియల్ లిటరసీపై రిజర్వు బ్యాంకు ప్రచురించిన పుస్తకాన్ని మంత్రి అచ్చన్నాయుడు ఆవిష్కరించారు.