-అత్యవసర సమయాల్లో ఉద్యోగులు సద్వినియోగ పర్చుకోవాలి
-చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.హదస్సా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సచివాలయం సివిల్ డిస్పెన్సరీలో గుండెపోటు నివారణ ఇంజక్షన్ టెనెక్టెప్లేస్ అందుబాటులో ఉందని, అత్యవసర సమయాల్లో ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.హదస్సా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10 వ తేదీన అదనపు ఎస్పీ బి.సాంబయ్య (54) తీవ్రమైన గుండెపోటుతో తమ డిస్పెన్సరీకి రాగా వెంటనే ఆయనకు టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ (రక్తం యొక్క గడ్డను కరిగించే మందు) ఇచ్చి, స్టెబిలైజ్ చేసి ప్రాణాలను కాపాడటం జరిగిందని ఆమె తెలిపారు. సెక్రటేరియట్ 108 వాహనంలో గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తదుపరి వైద్యసేవలకై వెంటనే తరలించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ వై.సత్యకుమార్ యాదవ్ గారు మరియు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులు, హెల్త్ డైరెక్టర్లు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై ప్రత్యేక శ్రద్దతో రాష్ట్ర సచివాలయం సివిల్ డిస్పెన్సరీలో అందుబాటులో ఉంచిన ఈ సౌకర్యాన్ని అత్యవసర సమయాల్లో ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News