Breaking News

మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ వాయిదా

-జిల్లా సంక్షేమ అధికారుల ప్రకటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ, అభ్యర్ధులకు ఉచిత మెగా డిఎస్సీ కోచింగ్ సంబంధించి నవంబర్ 10 వ తేదీన జరుగవలసిన స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా వేసినట్లు ఇన్చార్జి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్ , జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎన్ జ్యోతి లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ యమ్.యల్.సి. ఎన్నిక ప్రవర్తన నియమావలి కోడ్ ది.04-11-2024 మించి అమలు పర్చబడి యున్నందున వాయిదా వేయడం జరిగినదని యం. సందీప్ పేర్క న్నారు. కావున తదుపరి పరీక్ష ఏ రోజున నిర్వచించడం జరుగుతుందో సదరు తేదీని తదుపరి తేలియ పర్చనున్నట్లు తెలిపారు.

Check Also

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు

-అసెంబ్లీ తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం -లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాల తరలింపు ఉండదు…కర్నూలులోనే ఉంటాయి -యువగళం హామీ మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *