-50 శాతం ఆన్లైన్, 50 శాతం ఆఫ్ లైన్ లో సరఫరా చేపట్టాలి
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రిచ్ ల వద్ద 50 శాతం చొప్పున ఆన్లైన్ ఆఫ్ లైన్ లో ఇసుకను వినియోగదారులకి అందుబాటులో ఉంచాలని, ఆమేరకు సరఫరా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారము మధ్యాహ్నం కోటిలింగాల రీచ్ వద్ద ఇసుక బుకింగ్, సరఫరా విధానం ను ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, జిల్లాలో మైన్స్ అధికారి డి ఫణి భూషణ్ రెడ్డి, తదితరులతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇసుక రిచ్ స్థాయి ని బట్టి రోజుకు కనీసం వెయ్య నుంచీ రెండు వేల మెట్రిక్ టన్నుల ఇసుకను త్రవ్వకాలు చేపట్టి అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇసుక డీసీల్టేషన్ రిచ్ , ఓపెన్ రిచ్ ల ద్వారా కనీసం 30 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో లకి, మైన్స్ అధికారులకి స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు.
రిచ్ పాయింట్స్ వద్ద ఇసుక బుకింగ్ విధానం, సరఫరాలో ఎటువంటి అవకతవకలు జరిగినట్లు గుర్తించినా అటువంటి వారి విషయంలో ఉపేక్షించేది లేదని కలెక్టరు పి ప్రశాంతి హెచ్చరించారు. ఇసుక పాయింట్స్ వద్ద క్యూ లైన్స్ పాటించాలని, రిచ్ ఇంచార్జులకి స్పష్టమైన మార్గదర్శకాల ను ఇవ్వడం జరిగిందన్నారు. వాటిని తూ ఛ పాటించండి అని పేర్కొన్నారు. ఇప్పటికే బోట్స్ మ్యాన్ సొసైటి లకి రిచ్ లను కేటాయించామని, వారు ఆమేరకు త్రవ్వకాల నిర్వహించాలని, లేని ఎడల వారికీ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ తనిఖీ సందర్భంలో పాయింట్స్ వద్ద రికార్డులను పరిశీలించడం జరిగింది. డేటా వివరాలు నమోదు, ట్రక్కు షీట్, జీపీఎస్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టరు వెంట ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, జిల్లా మైన్స్ అధికారి డి ఫణి భూషణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News