వాడపల్లి , ఎరినమ్మ రీచ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జెసి చిన్న రాముడు

-ట్రాక్టర్ల ద్వారా నిరభ్యంతరంగా ఇసుకను వెళ్లవచ్చు
-జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
డిసిల్టేషన్, ఓపెన్ రీచల వద్ద ఇసుక లావాదేవీల విషయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా, డబ్బులు డిమాండ్ చేసిన అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కొవ్వూరు డివిజన్ పరిధిలోని వాడపల్లి , ఎరినమ్మ ఇసుక రిచ్ లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రీచ్ పొయింట్ వద్ద ఉన్న బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులతో ముఖాముఖి సంభాషించడం జరిగింది. ఉచిత ఇసుక పాలసీ విధానంలో మరింత సమర్థవంతంగా పని చెయ్యడం ముఖ్యం అన్నారు. వినియోగదారులకి ఇసుక లభ్యత అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాగం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇసుజ సరఫరా చేసే క్రమంలో ఎటువంటి ఆటంకం కలిగించిన అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక మొత్తంలో చెల్లింపులు జరపాలని కోరినా, మరే విధంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినా అటువంటి వారికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. ఈరోజు నుంచి మరో ఎనిమిది రీచ్ లని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఇసుక రవాణా కోసం ముందుకు వొచ్చిన ఎల్ వన్ బిడ్స్ వేసిన ఏజెన్సీస్ కార్యకలాపాలు నిర్వహించాలని, ఒకవేళ సకాలంలో పనులు ప్రారంభించక పోతే ఎల్ 2 కు కేటాయించనున్నట్లు తెలిపారు. అనుమతులు జారీ చేసిన 24 గంటల్లో కార్యకలాపాలు ప్రారంభం కావాలన్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా ఇసుక ను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ ద్వారా ఇసుక తీసుకుని వెళ్ళే వారి విషయములో ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వెంట కొవ్వూరు తహసిల్దార్ ఎమ్ దుర్గా ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *