రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అక్రమ ఇసుక నిలవాలని నివారించేందుకు దాడులు కొనసాగించడం జరుగుతుందని రెవిన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కోటి లింగాల రేవు ప్రాంతంలో అనధికార డంప్ ను గుర్తించడం జరిగింది. ఈ సందర్బంగా ఆర్డీవో కృష్ణ నాయక్ , ,ఏడీ మైన్స్ మరియు త్రి టౌన్ సీఐ లు టౌన్ వారు సాధారణ తనిఖీల్లో సుమారు మధ్యాహ్నం 2.30 గంటలకు కోటిలింగాల పేట సాండ్ పాయింట్ దగ్గరలో ఎటువంటి అనుమతులు లేని సుమారు రెండు లారీల ఇసుకను మరియు జెసిబి లను గుర్తుంచడం జరిగింది. ఈ క్రమంలో సదరు ఇసుక ను సీజ్ చేయవలసినదిగా రెవిన్యూ అధికారులను ఆదేశించడం జరిగిందనీ పేర్కొన్నారు. సదరు వాహనాలను సీజ్ చెయ్యాడం తో పాటు, కేసు నమోదు చేయవలసిందిగా త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి సూచనలు జారీ చేసినట్లు ఆర్డీవో తెలిపారు. ఇసుక అక్రమ నిలవ ఉంచిన ప్రాంత స్థల యజమానులకు కూడా నోటీసులు జారీ చెయ్యడం జరుగుతుందని ఆర్డీవో కృష్ణ నాయక్ పేర్కొన్నారు. ఈ సమయంలో జిల్లా మైన్స్ అధికారి డి ఫణి కుమార్ రెడ్డి, త్రి టౌన్ ఎస్ ఐ లు ఉన్నారు.
Tags rajamandri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …