గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సచివాలయం పరిశుభ్రంగా ఉంచుకొని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నగర కమిషనర్ చల్లా అనురాధ సచివాలయ కార్యదర్శులతో అన్నారు. బుధవారం కమిషనర్ 57, 58, 72 వార్డ్ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి అధికారులు, సచివాలయ కార్యదర్శులకు తగు ఆదేశాలు జారీ చేశారు. తొలుత కమిషనర్ ఆయా సచివాలయ పరిసరాలు, కంప్యూటర్ లు దుమ్ము, ధూళితో నిండి ఉండటం గమనించి సంబందిత సచివాలయ కార్యదర్శుల పై ఆగ్రహం వ్యక్తం చేసి స్వయంగా కంప్యూటర్ మీద దుమ్ము తుడిచారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి సచివాలయం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవలసిన భాద్యత ప్రతి కార్యదర్శి మీద ఉందని, అపరిశుభ్ర వాతావరణంలో సచివాలయాలు ఉంటే అడ్మిన్ కార్యదర్శిదే భాధ్యత అని స్పష్టం చేశారు. అనంతరం కార్యదర్శుల హాజరు రిజిస్టర్ ని తనిఖీ చేసి, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని, కార్యాలయ సమయంలో బయటకు వెళితే మూవ్మెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని, అలాగే బయో మెట్రిక్ లో కూడా హాజరు వేయాలని స్పష్టం చేశారు. స్పందన గ్రీవెన్స్, ఈ.ఆర్.పి. లను ఆన్ లైన్ లో తనిఖీ చేసి, మాట్లాడుతూ ప్రజల నుండి అందే ఫిర్యాదులు, దరఖాస్తులు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పెండింగ్ ఉంటే సంబందిత కార్యదర్శి పై చర్యలు తప్పవని హెచ్చరించారు. అడ్మిన్ కార్యదర్శులు రెవెన్యూ సర్వే పక్కా పూర్తి చేయాలన్నారు. అలాగే రైస్ కార్డ్ లు, పెన్షన్లు, ఇంటి స్థలం, ఆరోగ్య శ్రీ కార్డ్ ల దరఖాస్తులను ప్రాధాన్యతా పరంగా నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలన్నారు. ప్రతి సచివాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, పధకాల వివరాలను నోటీసు బోర్డ్ ల్లో పెట్టాలన్నారు. వాలంటీర్లతో కమిషనర్ మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పధకాల వివరాలు తెలియచేయడం, కోవిడ్ నిబందనల పై అవగాహన కల్గించడం చేయాలన్నారు. అలాగే వ్యర్ధాలను తడి పొడిగా విభజన చేసి ఇవ్వడం, రోడ్ల మీద కాలువల్లో వేస్తే అపరాధ రుసుం విధింపు పై కూడా తెలియ చేయాలని ఆదేశించారు.
Tags guntur
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …