Breaking News

గుంటూరులో ఆర్మీ రిక్రూట్మెంట్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ బుధవారం గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో గురువారం జరగనున్న ఆర్మీ రిక్రూటింగ్ ర్యాలీ గ్రౌండ్ లోనీ ఏర్పాట్లను ఆర్మీ అధికారులతో పరిశీలించారు. అర్బన్ ఎస్పీ  మాట్లాడుతూ ఏడు జిల్లాల నుంచి అభ్యర్థులు రోజు సుమారు 2500 అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ లో పాల్గొంటారని  రిక్రూట్మెంట్ కి సంబంధించి ప్రకాశం గుంటూరు నుంచి 250 మంది పోలీసు  సిబ్బందితో తో  బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని రిక్రూట్మెంట్ సమయాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని రిక్రూట్మెంట్ లో పాల్గొనే అభ్యర్థులు దళారుల మాటలు నమ్మొద్దని తెలియచేశారు. బందోబస్తు నిర్వహిస్తున్న ప్రతి పోలీసు సిబ్బంది మహమ్మారి కరోనా దృష్టిలో ఉంచుకొని కరోనా నిబంధనలు పాటిస్తూ శానిటైజర్ తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకొవాలని ఈ పదిహేను రోజులు రిక్రూట్మెంట్ ర్యాలీ లో ఆర్మీ అధికారులతో పాటు కష్టపడి పని చేయాలని సూచించారు.  ఈ  కార్యక్రమానికి ఆర్మీ అధికారులతో పాటు అడిషనల్ ఎస్పీ గంగాధరం (అడ్మిన్ ) ఈస్ట్ డిఎస్పీ ట్రాఫిక్ డిఎస్పీ, సిసిఎస్ డిఎస్పి, గుంటూరు అర్బన్ స్పెషల్ బ్రాంచ్ సిఐ సుబ్రహ్మణ్యం, ఆర్మీ రిక్రూట్మెంట్ సిఐ లు ఎస్ఐ లు, ఆర్మీ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం

-ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తాం. -రాష్ట్రంలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *