-సెన్సార్ల ద్వారా ఔట్ఫాల్ డ్రైన్లలో ఆటంకాలను గుర్తించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక సాంకేతికత ను ఉపయోగించి అవుట్ ఫాల్ డ్రైవర్ నిర్వహణ చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కేఎల్ రావు నగర్ ఔట్ ఫాల్ డ్రైన్, వరద ప్రభావిత ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్, కండ్రిక రాజీవ్ నగర్, బుడమేరు పరివాహక ప్రాంతాలు, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముందుగా కే ఎల్ రావు నగర్ లోన అవుట్ ఫాల్ డ్రైన్ ను పరిశీలించి, పూడికలు తీసి నీటి ప్రవాహానికి ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను అదిరించారు. సెన్సాస్ తో పనిచేసే స్కాడా (SCADA- సూపర్వైజరి కంట్రోల్ అండ్ డేటా ఎక్విజేషన్ ) సిస్టంతో నీటి ప్రవాహం తెలుసుకునేటట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సిస్టం ద్వారా వర్షపు నీరు రోడ్డుపైన నిలవకుండా డ్రైనలలో ప్రవహించేటట్టుగా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్కాడా ద్వారా ఎక్కడెక్కడ నీటి ప్రవాహం తగ్గిందో తెలుస్తుందని, తద్వారా ఆ డ్రైన్లలో పూడికలు తీసి నీటి ప్రవాహం లో ఆటకం లేకుండా చూసేటట్టుగా చర్యలు తీసుకోవచ్చని సూచించారు.
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజయవాడ నగరాన్ని గుంతలు లేని నగరంగా చేయాలని అధికారులను ఆదేశించారు. తన పర్యటనలు రోడ్డు పైనున్న ఒక గుంతను గమనించి, ఇంజనీరింగ్ సిబ్బంది దానిపై ఇప్పుడువరుకు ఎటువంటి చర్యలు తీసుకోనందుకు ఆగ్రహం వ్యక్తం చేసి పనిలో జాప్యం వహిస్తే ఖఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో ఉన్న గుంతలను త్వరితగతిన పూడ్చాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి సర్కిల్-2 పరిధిలో గల వరద ప్రభావిత ప్రాంతీలైనా బుడమేరు వంతన్న, అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ నుండి నున్న సరిహద్దు వరకు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాడైపోయిన రోడ్లు, డివైడర్లు, పేవర్ బ్లాక్స్, ఫుట్ పాత్లు త్వరితగతిన మరమతులు చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో అనుమతి పొందిన పనులను వెంటనే మొదలుపెట్టమని, మొదలుపెట్టిన పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి,జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఇంచార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ,పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్, వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంచార్జ్ యేసుపాదం పాదం, ఇతర సానిటేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.