విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల 19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచమీ నాడు జన్మించారు. ఆమె జీవిత విశేషాలు ప్రతి ఒక్కరూ తెలుసు కోవాల్సిన అవసరం ఉంది.
నేటి యువత కు ఆమె పోరాటం ఒక స్పూర్తి దాయకం
స్వాతంత్ర్య సమరం లో ఆమె ది మరచిపోలేని ఘట్టం గా భావించాలన్నారు.మహిళామోర్చా ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ లక్ష్మి ప్రసన్న, ఎస్ గీతామాధురి, వైస్ ప్రెసిడెంట్ వి రోహిణి, జోనల్ ఇంఛార్జి చిగురు పాటి లక్ష్మి, పాలడుగు శుభాషిణి తదితరులు పాల్గొన్నారు.