Breaking News

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తో భేటీ అయిన మందకృష్ణ మాదిగ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగా కలసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో వేగవంతం చేయడానికి సంబంధించిన విషయాన్ని మందకృష్ణ మాదిగ ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ ఈ విషయం లో స్పష్టమైన వైఖరి తో ఉన్న విషయం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ భేటీలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు ఉన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *