భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది

-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
-‘అర్నబ్’ తుఫాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి.. జాగ్రత్తలు పాటించాలి
-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
‘అర్నబ్’ తుఫాను తీరం దాటినప్పటికీ, ఈరోజు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ బయటకు రావద్దని స్పష్టం చేశారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, అత్యవసర పరిస్థితులు తలెత్తినా జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల స్థాయిల్లో ఏర్పాటు చేసిన నియంత్రణ కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు.

ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు సూచించే జాగ్రత్తలను పాటించాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తమతో పాటు కుటుంబ సభ్యుల భద్రతను కూడా కాపాడుకోవాలని కోరారు.