Breaking News

గౌడ సామాజికవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…

-అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గౌడ సామాజికవర్గానికి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వైన్‌ షాపుల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్‌ కూటమి ప్రభుత్వం పై ఆరోపణ చేశారు. శనివారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో మోర్ల ఏడుకొండలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. గౌడ కులస్తులకు వైన్‌ షాపుల్లో 10% రిజర్వేషన్‌ కల్పిస్తానని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. అనేకమార్లు వినతి పత్రాలు ప్రభుత్వానికి సమర్పించిన ఫలితం లేదన్నారు. ప్రీమియం షాపుల్లో కూడా గౌడ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ ఇవ్వలేదన్నారు. గౌడ సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఇస్తానన్న 10 శాతం రిజర్వేషన్‌ ప్రకారం షాపులను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గౌడ రిజర్వేషన్‌ షాపుల సంవత్సర పన్నులో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని, గౌడ రిజర్వేషన్‌ షాపుల విషయంలో గౌడ సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించాలని, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా చూడాలని, రిజర్వేషన్‌ షాపుల విషయంలో నాన్‌ రిఫండబుల్‌ పద్ధతి తొలగించి షాపులు దక్కని గౌడ్లకు బిడ్‌ అమౌంట్‌ తిరిగి ఇవ్వాలని, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు, ఈ సమావేశంలో స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.రంగారావు, నందిగామ మండల అధ్యక్షుడు కోసూరి కిరణ్‌బాబు, నాయకులు సింహాద్రి సాంబశివరావు, తొంటా వెంకట సుబ్రహ్మణ్యం, పి.బాల సాయికుమార్‌, రేలంగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *