Breaking News

భోగస్‌ వ్యక్తులను గాని, సంఘాలను గాని నమ్మి మోసపోవద్దు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఉభయ తెలుగు రాష్ట్రాలు) ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం & డిజిటల్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (ఉభయ తెలుగు తెలుగు రాష్ట్రాలు) వారు సంయుక్తముగా సమావేశం నిర్వహించారు. శనివారం గాంధీనగర్‌లో ఫిలింఛాంబర్‌ హాలులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పుట్ట గొడుగుల్లాగా రకరకాల కార్మిక సంఘాలు, సొసైటీల పేర్లతో స్థాపించి వారి స్వలాభాల కోసం అమాయకులైనా మన కార్మికుల వద్ద నుండి కార్డులిస్తామని, ఇళ్ళు ఇప్పిస్తామని రకరకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. అలా ఎవరూ మోసపోవద్దని, ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తించబడిన తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఉభయ తెలుగు రాష్ట్రాలు) దానికి అనుబంధముగా పనిచేస్తున్న తెలుగు ఫిలిం & డిజిటల్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (ఉభయ తెలుగు రాష్ట్రాలు) దాని 24 అనుబంధ సంఘాలు విజయవాడ కేంద్రంగా ఆంధ్రరాష్ట్రంలో ఫెడరేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఎవరూ భూటకపు కార్మిక సంఘాల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని, త్వరలో ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఇక్కడ ‘‘స్కిల్‌ డెవలప్మెంట్‌’’ వర్క్‌షాపులు కూడా ప్రారంభిస్తున్నామని తెలియచేస్తూ, పాత్రికేయులు, మీడియా ప్రతినిధుల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వదలచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఇకమీదట ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా జరిగే సినిమా షూటింగ్లు, వెబ్‌ సిరీస్లు, టివి. సీరియల్స్‌, యాడ్స్‌ చిత్రీకరణ జరిగినా సరే చిత్ర పరిశ్రమనే నమ్ముకుని జీవిస్తున్న మా సంస్థలు తెలుగు ఫిలిం Ê డిజిటల్‌ ఇండ్రస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్లో పనిచేసే శాఖలు (24 క్రాఫ్ట్‌) సంబంధించిన మమ్మల్ని సంప్రదించవలసినదిగా కోరుచున్నామన్నారు. త్వరలో విశాఖపట్నంలో జరుగబోయే సమావేశంలో మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి భరత్‌ భూషణ్‌ అధ్యక్షులు, దామోదర ప్రసాద్‌ ప్రధాన కార్యదర్శి, ప్రొడ్యూసర్‌ సెక్టార్‌ ప్రధాన కార్యదర్శి, జె.సాంబశివరావు ప్రధాన కార్యదర్శి, అలంకార్‌ ప్రసాద్‌ కార్యదర్శి మరియు ఫిలిం ఫెడరేషన్‌ నుండి అమ్మిరాజు- ప్రధాన కార్యదర్శి, వి.సురేష్‌- కోశాధికారి, ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్‌ వెల్లంకి శ్రీనివాస్‌కుమార్‌ మరియు హైదరాబాద్‌ నుండి 24 సంఘాల ప్రతినిధులు, సీనియర్‌ మేనేజర్‌ డి. సత్యనారాయణ ఆధ్వర్యంలో వైజాగ్‌, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంతకల్‌, తిరుపతిల నుండి 24 అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం విద్యార్థులకు వక్ఫ్ బోర్డు టాలెంట్ టెస్ట్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం విద్యార్థులకు వక్ఫ్ బోర్డు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ను సద్వినియోగం చేసుకోవాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *