గుంటూరు, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులు ప్రచార ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు, వాహనాలకు రోజువారీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ, సంబంధిత ప్రాంత డీఎస్పీ అనుమతి పత్రంతో గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని సింగిల్ విండో కౌంటర్లో దరఖాస్తు చేయాలని సూచించారు. బైక్ ర్యాలీలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలకు డీఎస్పీల నివేదికలు, అభిప్రాయాల ఆధారంగా అనుమతులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
ప్రచార అనుమతులు నిర్దేశించిన మార్గం, సమయానికి మాత్రమే వర్తిస్తాయని తెలిపారు. అభ్యర్థుల వ్యక్తిగత వాహనాలకు రిటర్నింగ్ అధికారులు, మైకులు, లౌడ్స్పీకర్లు ఏర్పాటు చేసిన ప్రచార వాహనాలకు సింగిల్ విండో కౌంటర్ ద్వారా అనుమతులు జారీ చేస్తామని వెల్లడించారు.
ఈ అనుమతుల ప్రక్రియ అక్టోబర్ 25, 2026 మధ్యాహ్నం 3 గంటల నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంటూ, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ కోరారు.
