-ఐదు డివిజన్లలో దద్దరిల్లిన ప్రచార ర్యాలీ
-విజయవాడ కార్పొరేషన్‌కు పూర్వవైభవం..
-కె నారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సీపీఐ, సీపీయం, కాంగ్రెస్, ప్రజాసంఘాలు బలపరిచిన నగర మేయర్ అభ్యర్థి, రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకు రోజురోజుకూ ప్రజా మద్దతు వెల్లువెత్తుతోంది. నగరంలోని 37, 38, 39, 40, 41వ డివిజన్ల పరిధిలో శుక్రవారం నిర్వహించిన భారీ ప్రచార ర్యాలీకి ఊహించని స్పందన లభించింది. ఊర్మిళనగర్ లో ప్రారంభమైన ఈ ర్యాలీ ఐదు డివిజన్ల మీదుగా సాగింది. వందలాది బైకులతో, వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలు పూల వర్షం కురిపిస్తూ, గెలుపు మీదే అంటూ ఆశీర్వదించారు. ముఖ్యంగా 41వ డివిజన్ కబేళా సెంటర్, మసీదు వద్ద ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో పాల్గొని ఏబీ ప్రచార వాహనంపై పూలు చల్లి తమ మద్దతు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న సీపీఐ జాతీయ నాయకులు నారాయణ మాట్లాడుతూ సీపీఐ తరుపున టీవీ వెంకటేశ్వరరావు ప్రథమ మేయర్‌గా భారీ మెజార్టీతో 1981లో విజయం సాధించి విజయవాడ కార్పొరేషన్ అచంచల మార్పుకు కారణబుతులయ్యారని తెలిపారు. ఇప్పుడు సీపీఐ, సీపీయం, కాంగ్రెస్ బలపరుస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు మేయర్ అభ్యర్ధిగా ప్రజలముందుకు వచ్చారని అన్నారు. టీవీ సృష్టించిన ప్రభాం్పునాన్ని ఏబీ కొనసాగిస్తారని స్పష్టం చేశారు. వీధివీధినా రాజకీయ ముసుగులో ఆంబోతుల కొట్లాటకు ప్రత్యామ్నాయమైన వ్యవస్థను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. మేయర్ అభ్యర్ధి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ “రాజకీయం అంటే రౌడీయిజం కాదనిచ, రాజకీయం అంటే భవిష్యత్తు గురించి ఆలోచించడం. డబ్బులు ఇచ్చి కొనేది రాజకీయం కాదని అది వ్యాపారం. అలాంటి వ్యాపారం మేము చేయబోమని ఆయన స్పష్టం చేశారు. డబ్బు, మద్యం పంచే రాజకీయాలకు భిన్నంగా, విలువలతో కూడిన రాజకీయం చేస్తానని .గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార ర్యాలీలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సీపీయం నాయకులు సీహెచ్ బాబురావు, వెంకటేశ్వరరావు, భూపతి రమణ, కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, నరహరశెట్టి నరసింహరావు, 37వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బుద్ధే వేణు గోపాలరావు, 40వ డివిజన్ అభ్యర్థి సురసాని రామిరెడ్డి, 41వ డివిజన్ అభ్యర్థి పంచదార్ల దుర్గాంబ తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
