-విజయవంతమైన నమూనాలకు వేదికగా సరస్ – 2026
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వ కొనుగోళ్ల విధానం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు విస్తృత మార్కెట్ అవకాశాలను కల్పించడంపై పీసీఐ ఇండియా, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో విజయవాడలోని జాతీయ సరస్ మేళా–2026లో ఆదివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వ విభాగాలకు ఉత్పత్తులు, సేవలను అందించడం ద్వారా మహిళా సంఘాలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడం, స్థిరమైన ఆదాయాన్ని పొందడం, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
నేషనల్ రిసోర్స్ సెల్ తరఫున టీమ్ లీడ్ విశాల్ సిన్హా, జయ ప్రభుత్వ మార్కెట్లలో స్వయం సహాయక సంఘాలకు అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. దీదీ కీ రసోయి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎస్ హెచ్ జీల నిర్వహణలో క్యాంటీన్లు, లాండ్రీ సేవలు, పశ్చిమ బెంగాల్లో మహిళా సంఘాల ద్వారా పాఠశాల యూనిఫాంల తయారీ, వ్యర్థాల నిర్వహణ సేవలు, కొచ్చి మెట్రోలో నీటి సరఫరా సేవలు వంటి విజయవంతమైన నమూనాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ మిషన్ మేనేజ్మెంట్ యూనిట్ నేషనల్ మిషన్ మేనేజర్ రాజీవ్ సింఘాల్ మాట్లాడుతూ, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ప్రభుత్వ విభాగాలకు ఉత్పత్తులు, సేవలను సరఫరా చేసే అవకాశాలను ఎస్ హెచ్ జీలకు కల్పించడం ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లు గ్రామీణ మహిళల మార్కెట్ పరిధిని విస్తరించగలవని పేర్కొన్నారు. ఇది మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు.
ఉత్తరప్రదేశ్లో టేక్ హోమ్ రేషన్ (THR) నమూనా విజయానికి దోహదపడిన ముఖ్యమైన అంశాలను వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించడం ద్వారా ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని, మహిళలకు కొత్త ఆదాయ మార్గాలు అందించవచ్చని, పేదరిక నిర్మూలనకు మరింత బలమైన పునాది వేయవచ్చని ఈ నమూనా నిరూపిస్తోందని వివరించారు.
ప్రభుత్వ కొనుగోళ్లు – మహిళా సాధికారతకు కీలక సాధనం
ప్రభుత్వ కొనుగోళ్ల విధానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా మహిళల నేతృత్వంలోని వ్యాపార సంస్థలకు దీర్ఘకాలిక మార్కె
