రెండవ రాండమైజేషన్ పూర్తి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్నికల సిబ్బంది రెండవ రాండమైజేషన్ గురువారం పూర్తి అయింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ కేంద్రంలో రాండమైజేషన్ ప్రక్రియను సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య, వ్యయ పరిశీలకులు నందిని సలారియాల ఆధ్వర్యంలో పూర్తి చేశారు. రాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ, వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్, పాల్గొన్నారు.