విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాణి గారి తోట ప్రాంతంలో 26, 25, 24 డివిజన్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిటైనింగ్ వాల్ నిర్మించడం జరిగింది అని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా భారీ వరదలు వస్తే ఈ ప్రాంత ప్రజలను కాపాడింది ఆ రిటైనింగ్ వాలే అని అన్నారు. మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులుగా కుమ్మర నాగేశ్వరరావు, దామోదర్, అల్లూరి అమ్మ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదేళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే దీనికి కారణమని ప్రజలు భావిస్తున్నారు. గత రెండున్నర సంవత్సరాల కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు పూర్తిగా నష్టపోయారని, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ప్రజలకు కావలసిన ఏ సౌకర్యం కల్పించలేదని తెలిపారు. గతంలో ఉన్న సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుతం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.చంద్రబాబు నాయుడికి విజయవాడ నగరం మీద ద్వేషం ఎక్కువని, నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దానిని అణగద్రొక్కాలని ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విజయవాడ నగర భవిష్యత్తును కాపాడుకోవడానికి, కూటమి పార్టీల కుట్రలను తిప్పికొట్టడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిని మరియు 86 కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.శాంతిభద్రతలు మరియు అభివృద్ధి: నగరంలో శాంతిభద్రతల లోపం, డ్రగ్స్, టెర్రరిస్టులు, నక్సలైట్లు వంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా, విజయవాడ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అవినాష్ గారు విజ్ఞప్తి చేశారు.
విజయవాడ అభివృద్ధి వైఎస్సార్సీపీతోనే సాధ్యం – దేవినేని అవినాష్ పిలుపు
