Breaking News

Andhra Pradesh

14వ డివిజన్ లో పలు సమస్యలపై అధికారులతో కలసి పర్యటన అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చిన – కమిషనర్ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య పనుల పరిశీలనలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ 14వ డివిజన్ పరిధిలోని పలు ప్రదేశాలలో పర్యటిస్తూ, డివిజన్ లో మెరుగైన పారిశుధ్య నిర్వహణ అమలు చేయుటతో పాటుగా డ్రెయిన్స్ ద్వారా మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. దర్సిపేట కృష్ణవేణి స్కూల్ రోడ్ నందు నివాసాల నుండి సేకరించిన చెత్త మరియు వ్యర్ధముల లోడింగ్ పాయింట్ వద్ద పరిసరాలు అన్నియు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుటతో పాటుగా ప్రక్కనే గల …

Read More »

కృష్ణా గోదావరి నదుల పరిరక్షణతో పాటు పరిశుభ్రంగా ఉంచడం, నదులను పూజించడం ప్రజల సాంప్రదాయం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుణ్య నదులుగా భావించే కృష్ణా గోదావరి నదుల పరిరక్షణతో పాటు పరిశుభ్రంగా ఉంచడం, నదులను పూజించడం ప్రజల సాంప్రదాయమని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. జవహర్ రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకుని బెర్మ్ పార్క్ వద్ద బుధవారం నాడు కృష్ణా జిల్లాలో కృష్ణా నదిలో, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్ వద్ద ప్రవాహంలో గోదావరి నదికి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. పంచ భూతాలలో ఒకటైన నీటిని పూజించి …

Read More »

పాలవెల్లువతో పాడి రైతులకు మేలు…

-జగనన్న పాలవెల్లువతో పాడిపరిశ్రమకు జవసత్వాలు… -నూజివీడు డివిజన్‌లోని 5 మండలాల్లోని 51 గ్రామాల్లో జెపివి ` మొదటిదశ… -డిసెంబరు 21 నుంచి చాట్రాయి, తిరువూరు, రెడ్డిగూడెం, విసన్నపేట మండలాల్లో రెండవ దశ… -జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాటు చేసిన జెపివి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను బుధవారం జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ సందర్శించారు. స్థానిక జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు అయిన జెపివి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో …

Read More »

పొట్టి శ్రీరాములు 69వ వర్గంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు వర్దంతి సందర్బంగా బుధవారం మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు  చిత్ర పటానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ ఐ.పి.ఎస్., పలువురు పోలీసు ఉన్నతాధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Read More »

పొట్టి శ్రీరాములు 69వ వర్గంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా  బుధవారం విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., మరియు నగర పోలీసు అధికారులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించడం జరిగింది. విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ అమరజీవి  పొట్టి శ్రీరాములు  ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించి అమరులయ్యారని, ఆంధ్ర …

Read More »

అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగం మరువలేనిది… :  సమగ్ర శిక్షా ఎస్పీడీ కె.వెట్రిసెల్వి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషిచేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆయన చేసిన సేవలు, త్యాగనిరతి మరువలేనిదని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా బుధవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీడీ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు పట్టుదల, అకుంఠిత దీక్షను అందరూ అలవర్చుకుని విద్యాకార్యక్రమాలు మరింత …

Read More »

సిఎస్ తో భేటీ అయిన తూర్పు నావికాదళం కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్త

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్త(ఎవిఎస్ఎం,వైఎస్ఎం,విఎస్ఎం)ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మతో భేటీ అయ్యారు.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో సిఎస్ డా.శర్మను వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్త మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఇరువురు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ భేటీలో తూర్పు నావికాదళం అధికారులు కెప్టెన్ విఎస్సి రావు,కెప్టెన్ ప్రదీప్ సింగ్ సేధీ,కమాండర్ సుజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

గవర్నర్ తో భేటీ అయిన తూర్పు నావికా దళాధిపతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నావికాదళ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్‌గా భాద్యతలు స్వీకరించిన నేపధ్యంలో వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. బుధవారం ఉదయం నావికదళ అధికారులతో కలిసి రాజ్ భవన్ కు వచ్చిన దాస్ గుప్తాకు గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన తదుపరి మొదటిసారిగా గవర్నర్ ను కలిసిన వైస్ అడ్మిరల్ …

Read More »

తణుకు పట్టణంలో బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన…

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : తణుకు పట్టణంలో ది.21.12.2021 న జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం పరిశీలిస్తున్న జాయింట్ కలెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ (రెవెన్యూ), జాయింట్ కలెక్టర్( హౌసింగ్ ) సూరజ్ గానోరె , ఆర్డీవో కొవ్వూరు ఎస్.మల్లిబాబు, తదితరులు. ఈ సందర్భంగా రెవెన్యూ, మునిసిపల్, హౌసింగ్, ఆర్ అండ్ బి, పోలీస్, తదితర శాఖల అధికారులకు సూచనలు చేశారు.

Read More »

సచివాలయ ఉద్యోగుల ప్రోబషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.పి.జె.ఎ.సి చైర్మన్, మరియు ఎ.పి.యన్.జి.ఓ స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి.శ్రీనివాస రావు సారథ్యంలో, గ్రామ వార్డు సచివాలయాల స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ జైన్ ను కలిసి సచివాలయ ఉద్యోగుల ప్రోబషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎ.పి.జె.ఎ.సి మరియు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ వినతిపత్రం అందచేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వెంటనే ప్రక్రియ పూర్తి చేసి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని 11పి.ఆర్.సి ని వర్తింపచేయాలని కోరుతూ ఇతర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర …

Read More »