Breaking News

పాలవెల్లువతో పాడి రైతులకు మేలు…

-జగనన్న పాలవెల్లువతో పాడిపరిశ్రమకు జవసత్వాలు…
-నూజివీడు డివిజన్‌లోని 5 మండలాల్లోని 51 గ్రామాల్లో జెపివి ` మొదటిదశ…
-డిసెంబరు 21 నుంచి చాట్రాయి, తిరువూరు, రెడ్డిగూడెం, విసన్నపేట మండలాల్లో రెండవ దశ…
-జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాటు చేసిన జెపివి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను బుధవారం జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ సందర్శించారు.
స్థానిక జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు అయిన జెపివి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో జాయింట్‌కలెక్టర్‌ డా.కె. మాధవిలతతో కలిసి సంబంధిత అధికారులు, సిబ్బందితో కలెక్టర్‌ జె.నివాస్‌ జగనన్న పాలవెల్లువపై సమీక్షించారు. జగనన్న పాలవెల్లువ నిర్వహణకు సంబంధించి అంత కంప్యూటరీకరణ చేయడం జరిగింది. సంబంధిత గ్రామాల నుంచి అందే సమాచారాన్ని, ఆయా మహిళ సహకార పాల డెయిరీలకు అవసరమైన సాంకేతిక సహకారం ఇతర అంశాలకు జెపివి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఉపకరిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల సేకరణలో దళారీ వ్యవస్థ లేకుండా మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా జగనన్న పాలవెల్లువ కార్యక్రమం రూపుదిద్దడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో మహిళల ఆర్థికాభివృద్ధికి జెపివి ఎంతో దోహదపడుతుందన్నారు. వారి ఆర్ధికాభివృద్ధి లక్ష్యానికి జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పించడం జరుగుతుందన్నారు. అగిరిపల్లి, నూజివీడు, గంపలగూడెం, ఏ కొండూరు, ముసునూరు మండలాల తహాశీల్థార్లు, యంపిడివోలు, ఏపియంలను విలేజ్‌ లెవెల్‌ ఆఫీసర్లగా నియమించారు. ఈసందర్భంగా జగనన్న పాలవెల్లువ విజయవంతం కావడానికి అవసరమైన దిశా నిర్థేశం చేశారు.జగనన్న పాలవెల్లువ కింద నూజివీడు డివిజన్‌లోని 5 మండలాలోని 51 గ్రామాల్లో జెపివి మొదటి విడత నడుస్తుండగా డిసెంబరు 21 నుంచి చాట్రాయి, తిరువూరు, రెడ్డిగూడెం, విసన్నపేట మండలాల్లో జెపివి రెండవ విడత ప్రారంభానికి సన్నహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలో జిల్లా జగనన్న పాలవెల్లువ నోడల్‌ ఆఫీసర్‌ లలిత్‌కుమార్‌, సెంటర్‌ కమాండ్‌ కంట్రోల్‌ టీమ్‌ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *