Breaking News

కృష్ణా గోదావరి నదుల పరిరక్షణతో పాటు పరిశుభ్రంగా ఉంచడం, నదులను పూజించడం ప్రజల సాంప్రదాయం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పుణ్య నదులుగా భావించే కృష్ణా గోదావరి నదుల పరిరక్షణతో పాటు పరిశుభ్రంగా ఉంచడం, నదులను పూజించడం ప్రజల సాంప్రదాయమని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. జవహర్ రెడ్డి అన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకుని బెర్మ్ పార్క్ వద్ద బుధవారం నాడు కృష్ణా జిల్లాలో కృష్ణా నదిలో, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్ వద్ద ప్రవాహంలో గోదావరి నదికి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. పంచ భూతాలలో ఒకటైన నీటిని పూజించి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పించుకొనడం మన సంస్కృతి సంప్రదాయంలో భాగమని తెలిపారు. మనకు ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ మన జీవితాలను ప్రభావితం చేసే నదులను పూజించడం మరో పండుగగా నిర్వహించడం మన సంప్రదాయం అని జవహర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా 12 ఏళ్లకు ఒకసారి నదీ పరీవాహిక ప్రాంతాలలో పుష్కరాలు నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు.
ఇందుకు గాను నదులను పరిశుభ్రంగా ఉంచేందుకు యువత ముందుకు వచ్చి నదికి ఇరువైపులా పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని పిలుపునిచ్చారు. నాగరికత నదీ పరివాహక ప్రాంతాల లోనే ప్రారంభం అయినదన్నారు. మానవ మనుగడ నదీ ఆధారమని, నదుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. శుభ్రంగా ఉండే ప్రాంతాలలో నదీ ఉత్సవాలు నిర్వహణకు ఎంతో అనుకూలంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. నగర పరిధిలో నదీ పరివాహక ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు మునిసిపల్ కార్పొరేషన్ సహకారం తీసుకున్నదని యువతీ యువకులు ముందుకు రావాలని ఆయన సూచించారు. విద్యార్థిని విద్యార్థులతో అవగాహనా సదస్సులు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణతో ప్రజల్లో నదుల ప్రాధాన్యతపై అవగాహన తీసుకురావాలన్నారు. నదీ ఉత్సవాలు ఈ నెల 15 నుండి 25వ తేదీ వరకు 10 రోజులు నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమాలను పర్య వేక్షించేందుకు కృష్ణా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జె. నివాస్, జలవనరుల శాఖ ఇఎన్ సి ఎమ్. నారాయణ రెడ్డి, జలవనరుల శాఖ పర్య వేక్షక ఇంజనీర్ మురళి కృష్ణ వేద పండితులతో కలిసి కృష్ణా నదిలో కృష్ణవేణమ్మకు హారతిచ్చి వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు. ఉత్సవాలలో బాగంగా నదుల గట్టులపై పిచ్చి మొక్కల తొలగింపు, శుబ్ర పరచడం, ప్రవహించే ప్రధాన కాల్వలలో గల గుర్రపు డెక్క తొలగింపు తదితర అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు జలవనరుల శాఖ మరియు రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో కలెక్టర్ ల పర్వవేక్షణలో 10 రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. ఉత్సవాలలో భాగంగా ఉన్నతాధికారులు మొక్కలను నాటి ఉత్సవాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి హాజరైన జలవనరుల శాఖ సిబ్బంది, కార్పొరేషన్ తరపున పనిచేస్తున్న పారిశుధ్య పనివారలను ఈ సందర్భంగా జవవర్ రెడ్డి వారి సేవలను కొనియాడారు.
కృష్ణా నదీ పంటు పై జరిగిన మీడియా సమావేశంలో కృష్ణా కలెక్టర్ జె. నివాస్, వి.యం.సి. కమీషనర్ ప్రసన్న వెంకటేష్, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ లు సి. నారాయణ రెడ్డి, ఆర్. సతీష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ లు కే. శ్రీనివాస్, టి.వి.యెన్.ఆర్. కుమార్, ఎస్.ఈ. ఏ. మురళి కృష్ణా రెడ్డి, ఇ ఇ లు ఏ. రాజా స్వరూప్ కుమార్, కే. శ్రీనివాస రావు, జి. గోపాల్, జలవనరుల శాఖ, మునిసిపల్, రెవిన్యూ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *