Breaking News

Andhra Pradesh

చట్టాల అవగాహనతో మహిళల్లో మనోధైర్యం

-మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ -సత్వర న్యాయంతో మహిళలకు రక్షణ -‘మహిళలు- సత్వరన్యాయం’ పై చర్చాగోష్టి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలపై, బాలికలపై జరిగే లైంగిక హింసను ఎదుర్కోవడానికి సమర్థమైన విచారణ, త్వరితగతిన నేరస్థులకు శిక్షలు పడేటట్లు చూడడం మాత్రమే సత్వరన్యాయానికి పరిష్కారమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బుధవారం మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘మహిళలు- సత్వరన్యాయం’ అంశంపై జరిగిన చర్చాగోష్టికి రిటైర్డ్ జడ్జిలు, న్యాయ నిపుణులు, దిశ అధికారులు, వివిధ సంస్థల …

Read More »

కార్తీక పౌర్ణిమికు వివిధ శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19 వ తేదీన కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు 2 లక్షల మందికి పైగా భక్తులు మంగినపూడి బీచ్ కు వస్తారని ఒక అంచనా ఉందని , పక్కా ప్రణాళికతో జిల్లా రెవెన్యూ, పోలీసు, మత్స్య, వైద్య, అగ్ని మాపక ఆర్టీసీ, మున్సిపల్ తదితరశాఖల అధికారులు చక్కని సమన్వయంతో వ్యవహరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) …

Read More »

విద్యార్థుల్లో గల సృజనాత్మకతను పెంపొందించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా రాణించే విధంగా విద్యాబోధన ఉండాలి…

-విద్యార్థులతో పాటు నేలపైనే కూర్చోని మధ్యాహ్నం భోజనం చేసి ఆహార నాణ్యతను గుర్తించి సంతృప్తిని వ్యక్తం చేశారు. -జాయింట్ కలెక్టరు(అభివృద్ది) శివశంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా రాణించే విధంగా ఉపాధ్యాయులు వారికి ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధనను అందించాలని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివ శంకర్ అన్నారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను బుధవారం జాయింట్ కలెక్టరు శివశంకర్, సాంఘీక సంక్షేమ అధికారిణి సరస్వతి ఇతర …

Read More »

సోమేశ్వరుడు సేవలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా…

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామం లో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామివారిని కార్తీక మాసం సందర్భంగా బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు , అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం తో స్వాగతం పలికారు. శ్రీ స్వామి వారికి స్వయంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ మండపం లో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. గ్రామ సర్పంచ్ తమనంపూడి వీర్రెడ్డి శ్రీ స్వామి అమ్మవార్ల వారి చిత్ర పటాన్ని, …

Read More »

రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ ఉద్యోగులు విధి నిర్వహణ పని ఒత్తిడి ని అధిగమించడానికి నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. బుధవారం కొవ్వూరు మునిసిపల్ కార్యాలయం నుండి జిల్లా లోని రెవెన్యూ డివిజన్ అధికారులతో, తహసీల్దార్ లతో రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, తహసీల్దార్ లు మీమీ బాధ్యతలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, పని ఒత్తిడి ని అధిగమించేందుకు సమయపాలన తో …

Read More »

దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ లీగల్ అడ్వైజర్ మరియు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ శంకరప్ప తో ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి బుధవారం కనకదుర్గమ్మ దర్శనము చేసుకున్నారు. ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం అనంతరం తీర్ధం ప్రసాదాలు, ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బాబు రమేష్ ప్రసాద్, వెంకటేష్ రెడ్డి, వాసు శేఖర్, జితేంద్ర, లీలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్ళుగా వైసీపీ ప్రభుత్వ పాలన… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.బుధవారం నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్, రాణిగారి తోట నందు స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం తో కలిసి అవినాష్ ప్రజలనడిగి సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా …

Read More »

మూడు రోజుల డిల్లీ పర్యటనకు గవర్నర్…

-రాష్ట్రపతి నేతృత్వంలో గవర్నర్ల సదస్సు -ఉపరాష్ట్రపతిలో భేటీ కానున్న బిశ్వభూషణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ మూడురోజుల అధికారిక పర్యటన కోసం బుధవారం డిల్లీ బయలుదేరనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేతృత్వంలో డిల్లీలో జరిగే గవర్నర్ల సదస్సుకు గౌరవ బిశ్వభూషణ్ హాజరు కానుండగా, ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ వేదికగా ఉంది. సదస్సు గురువారం జరగనుండగా, విభిన్న అంశాలపై రాష్ట్రపతి గవర్నర్లకు దిశా నిర్ధేశం చేయనున్నారు. అయా రాష్ట్రాల …

Read More »

రాష్ట్ర శాసన పరిషత్తులో ఎంఎల్ఏ కోటాకింద 3 ఎంఎల్సి స్థానాల భర్తీకి నోటిఫికేషన్ జారీ

-నామీనేషన్ల స్వీకరణకు ఆఖరు తేది:16 నవంబరు,2021. -నామినేషన్ల పరిశీలన:17 నవంబరు,2021. -నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేది:22 నవంబరు,2021. -పోలింగ్ తేది,సమయం,ప్రదేశం:29 నవంబరు,2021,ఉ.9గం.ల నుండి సా.4గం.ల వరకు అసెంబ్లీ భవనంలో. -ఓట్ల లెక్కింపు తేది,సమయం:29 నవంబరు,2021.సా.5గం.లకు. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన పరిషత్తులో ఖాళీగా ఉన్న,శాసన సభ సభ్యులచే ఎన్నుకోవాల్సిన ముగ్గురు శాసన మండలి సభ్యులు(MLC)ఎన్నిక నిమిత్తం మంగళవారం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పివి సుబ్బారెడ్డి నోటిఫికేషన్ జారీ …

Read More »

మిషన్ లీగల్ సర్వీసెస్ ప్రారంభం…

-నిరుపేదలు అందరికీ న్యాయం అందించే న్యాయ సహాయ ఉద్యమం గా అభివర్ణణ -రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిస్సహాయత వల్ల న్యాయం పొందలేని అణగారిని వర్గాల ప్రజలకు, నిరుపేదలకు, నిరక్షరాస్యులకు అన్ని విదాలైన న్యాయ సేవలు అందించాలనే దృక్పధంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయ సేవల కమిటీ రూపొందించిన మిషన్ లీగల్ సర్వీసెస్ ను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మంగళవారం ప్రారంభించారు. అమరావతి నేలపాడు లోని రాష్ట్ర …

Read More »