Breaking News

రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ ఉద్యోగులు విధి నిర్వహణ పని ఒత్తిడి ని అధిగమించడానికి నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. బుధవారం కొవ్వూరు మునిసిపల్ కార్యాలయం నుండి జిల్లా లోని రెవెన్యూ డివిజన్ అధికారులతో, తహసీల్దార్ లతో రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, తహసీల్దార్ లు మీమీ బాధ్యతలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, పని ఒత్తిడి ని అధిగమించేందుకు సమయపాలన తో కూడిన ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత కార్యక్రమాలు అమలు లో నిర్దుష్టమైన విధి విధానాలు మీమీ స్థాయిల్లో రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భూముల రికార్డుల స్వచ్ఛిలత, భూముల రీసర్వే, జగనన్న సంపూర్ణ గృహ హక్కు లో భాగంగా వన్ టైం సేట్టిల్మెంట్ విషయం పై ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్ళవలసి ఉంటుందన్నారు. కుళాయి(నాలా) కలెక్షన్లు, రైతుల నుండి వసూలు చెయ్యవలసిన నీటి తీరువా బకాయి ల, రెవెన్యూ రికవరీ వసూళ్ల లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. పని విభజన, రోజూ వారీగా లక్ష్యాలను రూపొందించుకోవడం వలన ఉద్యోగుల పై పని ఒత్తిడి తగ్గి , మెరుగైన ఫలితాలు సాదించగలుగుతామని పేర్కొన్నారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణం కోసం రెండోవ దశ లేవిలింగ్ పనులు ఎన్ని ఉన్నాయి, భూసేకరణ చేపట్టాల్సి వివరాలు తెలుసుకుని ఆయా పనులు వేగవంతం చెయ్యాలని కలెక్టర్ మిశ్రా తెలిపారు. ఇళ్ల కాలనీల్లో లే అవుట్స్, త్రాగునీరు, అప్రోచ్ రహదారుల, విద్యుత్, భూముల లేవిలింగ్, తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. గ్రామ సచివాలయ భవనాలు, హెల్త్ క్లినిక్స్ భవనాల నిర్మాణల తీరుపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు పూర్తి నిర్దుష్టమైన కాల పరిమితి తో పూర్తి చేయాల్సి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు పై ఎటువంటి అవాంతరాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు, మునిసిపల్ కమీషనర్ టి. రవికుమార్, తహసీల్దార్ బి. నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *