Breaking News

సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్ళుగా వైసీపీ ప్రభుత్వ పాలన… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.బుధవారం నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్, రాణిగారి తోట నందు స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం తో కలిసి అవినాష్ ప్రజలనడిగి సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పనులు అన్ని వేగవంతం గా జరిగేలా నిత్యం పర్యవేక్షణ చేయలని వైసీపీ నాయకులకు సూచించారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం లో ఈ డివిజన్ లో వైసీపీ కార్పొరేటర్ గెలిచారని ఇక్కడి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా,అభివృద్ధి కి సహకరించకుండా నానారకాలుగా ఇబ్బందులు పెట్టారని,కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వందల కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు చెప్పట్టడామే కాకుండా, ఇంటిఇంటికి మంచినీరు సరఫర చేసేలా మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం గా పూర్తి చేసి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఒక పక్క వేగవంతం గా అభివృద్ధి పనులు చేయడంతో పాటు మరోపక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు గాని,ఇళ్ల పట్టాల అందజేయడం జరుగుతుంది అంటే అది వైసీపీ ప్రభుత్వ ఘనతనే అని అన్నారు.రిటైనింగ్ వాల్ నిర్మాణం వలన ఆవాసం కోల్పోయిన వారికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు కలిగిన ఇళ్లను ఉచితంగా కేటాయించాము అని పేద ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది అనేదానికి ఇదే నిదర్శనం అన్నారు.అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని,ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు మా పార్టీ వైపే ఉంటారని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాగవంశ డైరక్టర్ సుజాత, వైసిపి నాయకులు, కావటి దామోదర్, జయలక్ష్మీ, బొడ్డు అప్పలనాయుడు, ముక్కు వేంకటేశ్వర రెడ్డి, అయ్యపరెడ్డి, తాజుద్దీన్, మొహిద్దిన్, డబ్బుకొట్టు.వేంకటేశ్వర రావు,చింతా బుచ్చిబాబు, వేంకటేశ్వర రావు మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *