-అన్‌లక్కీ షర్ట్ దర్శకుడిని సత్కరించిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ -ఈ గౌరవం దక్కడం నా పూర్వజన్మ సుకృతం: దర్శకుడు సురంజన్ దే -విశాఖ అందాలు ఆకట్టుకున్నాయి: బాలివుడ్ హీరోయిన్ శుభశ్రీ కర్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అన్‌లక్కీ షర్ట్ పేరుతో ఒక లఘు చిత్రాన్ని నిర్మించి ఆరు అంతర్జాతీయ, పలు జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు నామినేట్ అయిన ఆ చిత్ర దర్శకుడు సురంజన్ దే తెలుగులో ఎఫ్.టి.పి.సి. సంస్థ ఆధ్వర్యంలో ఓ సామాజిక నేపధ్యం …
Read More »Andhra Pradesh
నీట్‌లో శ్రీ చైతన్య విజయకేతనం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్‌లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించి విజయకేతనం ఎగురవేశాయని విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ బి.ఎస్.రావు ఆనందం వ్యక్తం చేశారు. గోసాల శ్రీచైతన్య క్యాంపస్‌లో శనివారం జరిగిన ర్యాంకుల సక్సెస్‌మీట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ 2021లో జాతీయ స్థాయిలో శ్రీ చైతన్య విద్యాసంస్థలు 5వ ర్యాంకుతోపాటు 10 లోపు 3, 100 లోపు 21తోపాటు 6449 మంది విద్యార్దులు మెడికల్ సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో మరే …
Read More »రామినేని విశిష్ట పురస్కారాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి 1999 నుంచి డాక్టర్ రామినేని ఫౌండేషన్ ‘పురస్కారాలు’ అందిస్తున్నామని, దానిలో భాగంగా ఈ ఏడాది ఐదుగురు డాక్టర్ కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా, బ్రహ్మానందం, ప్రొఫెసర్ దుర్గాపద్మజ, ఎస్.వి.రామారావులకు డాక్టర్ రామినేని ఫౌండేషన్ ‘పురస్కారాలు’ 2021 లభించినట్లు డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ రామినేని ధర్మప్రచారక్ తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ కన్వీనర్, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం …
Read More »దేశాభివృద్దిలో విద్యదే కీలక భూమిక…
-కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశాభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, విద్య ఒక దేశానికి వెన్నెముకగా ఉంటిదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరించందన్ అన్నారు. విద్యాసంస్థలు ఉత్పత్తి చేసే మానవ వనరులు దేశ పురోగతిలో అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయన్నారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో గవర్నర్ హాజరయ్యారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో గవర్నర్ ప్రసంగించారు. గౌరవ హరిచందన్ మాట్లాడుతూ …
Read More »అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (ఓటీఎస్)పై లబ్దిదారులకు అవగాహన కల్పించాలి…
-ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవడం ద్వారా థర్డ్ వేవ్ ను నియంత్రించగలం… -గ్రామ, వార్డు, పీహెచ్ సీల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచాం… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం 1983 నుంచి మంజూరు చేసిన ఇళ్లస్థలాల్లో ఇళ్లు నిర్మించుకొనే నిమిత్తం గృహనిర్మాణ సంస్థ ద్వారా అప్పుతీసుకొని తీర్చని వారి రుణాలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఆర్డీవో శ్రీనుకుమార్ తెలిపారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం …
Read More »పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించాలి… : జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : *జిల్లాలో నిర్వహిస్తున్న మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి, వార్డ్ మెంబర్ ల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ ఆదేశించారు. శనివారం నగరంలోని ఇరిగేషన్ కాంపౌండ్ లోని రైతు భవన్ లో మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి, వార్డ్ మెంబర్ ల ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనీలా శిక్షణ కార్యక్రమంలో జేసీ ఎల్.శివశంకర్,జడ్పీ సీఈవో సూర్యప్రకాష్ రావు, జిల్లా పంచాయతీ అధికారి జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి, …
Read More »ఆకర్షనీయ మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దాలి…
-కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద జరుగుతున్న గ్రీనరీ పనుల పరిశీలన – -కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వరాజ్య మైదానం వద్ద కలెక్టర్ వారి క్యాంప్ కార్యాలయం మరియు చీఫ్ సెక్రటరీ క్యాంపు కార్యాలయం వద్ద జరుగుతున్న గ్రీనరీ అభివృద్ధి పనులను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. అధికారులతో కలసి మొక్కలు నాటి, మంచి ఆకర్షనీయమైన పూల మొక్కలను నాటి సుందరంగా ఆకర్షనియంగా తీర్చిదిద్దాలని ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు. …
Read More »గురునానక్ నగర్, APIIC కాలనీ, బి.ఆర్.టి.ఎస్ రోడ్ లలోని వార్డ్ సచివాలయాలను సందర్శన
-ప్రభుత్వ పథకములు అన్నియు ప్రజలకు చేరువ చేయాలి -కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. గురునానక్ నగర్ నందలి 6వ వార్డ్ సచివాలయం మరియు బి.ఆర్.టి.ఎస్ రోడ్ నందలి 184 & 275 వార్డ్ సచివలయలను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. …
Read More »నాడు -నేడు ఫేజ్-2 పనుల పురోగతిపై ప్రధానోపాధ్యాయులతో సమీక్ష
-అన్ని పాఠశాలలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయాలి -ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు ప్రధానోపాధ్యాయులతో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ శనివారం నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. నాడు-నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కమీషనర్ మాట్లాడుతూ నాడు-నేడు పనులు ఎంతవరకు ప్రారంభామైనది అని తెలుసుకొని పలు సూచనలు చేసారు. పేరెంట్స్ కమిటీ తో అకౌంట్ ఓపెన్ చేయుట, ఎమినిటీస్ సెక్రెటరీలు మరియు ఇంజనీర్స్ తో ఎస్టిమేషన్ …
Read More »కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కి జనసేన వినతిపత్రం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో శనివారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ IAS ని వారి చాంబర్లో కలిసి పలు సమస్యలపై జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్, ఉపాధ్యక్షులు వెన్నా.శివ శంకర్ ,కామెల్ల. సోమనాథం, పార్టీ కార్యదర్శిలు శనివారపు శివ, కొర్ర గంజి వెంకటరమణ, వేవినా నాగరాజు, జనసేన నాయకులు బొలిశెట్టి వంశీ , పులి చేరి రమేష్ వినతిపత్రం అందచేశారు. నెహ్రూ బొమ్మ సెంటర్ నుండి చిట్టినగర్ వరకు పూర్తిగా పాడైపోయిన ప్రధాన రహదారిని తక్షణమే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని, టిడ్కో ఇళ్ల …
Read More »