Breaking News

స్కేటింగ్ లో బంగారు ప‌త‌కం సాధించిన హ‌శీష్ ను అభినందించిన ఎంపి కేశినేని శివనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
త‌మిళనాడు పొలాచిలో డిసెంబ‌ర్ 5 నుంచి 15 వ‌ర‌కు రోల‌ర్ స్కేటింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన జాతీయ స్థాయి పోటీల్లో అండ‌ర్ -14 విభాగం కింద ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఇన్ లైన్ ఫ్రీ స్టైల్ లో బంగారు ప‌తకాన్ని సాధించిన మెరుగుపాల హ‌శీష్ ను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివనాథ్ అభినందించారు. అలాగే హ‌శీష్ అభిరుచి తెలుసుకుని ఆ రంగంలో ప్రొత్సహించినందుకు హ‌శీష్ త‌ల్లిదండ్రులు మెరుగుపాల రాజు, శివ‌మాధ‌విల‌ను ప్రశంసించారు. శ‌నివారం గురునాన‌క్ కాల‌నీ విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను హ‌శీష్ త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లవ‌టం జ‌రిగింది. తనని అభినందించిన ఎంపి కేశినేని శివనాథ్ కి హ‌శీష్ కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *