-నాస్తిక కేంద్రం లో ప్రారంభమైన 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు
-ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
-సావనీరు ఆవిష్కరించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలకు మరింతగా సామాజిక అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి.. మహిళా సాధికారిత కోసం మహిళలు సంఘటితం కావాలని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర వున్న నాస్తిక కేంద్రంలో శనివారం ప్రారంభమైన 12వ ప్రపంచ నాస్తిక మహాసభలకు ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభల సావనీరుతో పాటు, ప్రపంచ నాస్తిక మహాసభల కన్వీనర్ డాక్టర్ సమరం హిందీలోకి అనువదించిన పాజిటివ్ ఏథిజం పుస్తకం, డాక్టర్ కీర్తి బొల్లినేని రచించిన హౌ ఇండియన్స్ ఎథెస్ట్ ముమెంట్ షేప్డ్ మై లైఫ్ (how india’s atheist movement shaped my life) పుస్తకాలను ఎంపి కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సంఘసంస్కర్త, హేతువాది, నాస్తికవాద నేత గోరా ఆశయాలు, ఆలోచనలు స్ఫూర్తి దాయకమన్నారు. డాక్టర్ జి.సమరం నెలకొల్పిన వాసవ్య సెంటర్ లో నిరంతరం సామాజిక అవగాహన కార్యక్రమాలు జరుగుతా వుంటాయన్నారు. ఇటీవలే డాక్టర్ కీర్తి కలిసినప్పుడు మహిళా సాధికారిత విషయంపై చర్చించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం మరిన్నీ కార్యక్రమాలు చేపట్టాలని, దానికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తానన్నారు.
అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గోరా ఆశయాలు విని ఎంతోగానో స్పూర్తి పొందామన్నారు. దేవుడి పై నమ్మకంతో అనేక గంథ్రాలు వచ్చినా..ఆ గంధ్రాల సారాంశం మానవ సేవే మాధవ సేవ అని వుంటుందన్నారు. గోరా ఆశయం కూడా అదేనన్నారు. ఆయన ఎన్నో సేవ కార్యక్రమాలు చేయటంతోపాటు వర్ణవ్యవస్థ, అంటరానితనం పై యుద్దం చేశాడన్నారు.
ఈ కార్యక్రమంలో వికాస్ గోరా, కొమరేషన్, ఫెడరేషన్ ఆఫ్ రెషనలిస్ట్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ నరేంద్ర నాయక్, కేంద్ర సాహిత్య అవార్డ్ గ్రహీత దేవరాజు మహారాజు, స్వాతంత్య సమరయోధురాలు మనోరమలతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News