Breaking News

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం
-గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-రాబోయే రోజుల్లో తెలుగు సినిమా చరిత్రలో ఈ చిత్రం గేమ్ ఛేంజర్ గా నిలబడాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్
-అద్భుతమైన నటన కౌశల్యం ప్రదర్శిస్తున్న రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అని కొనియాడిన మంత్రి దుర్గేష్
-అనేక ప్రకృతి సౌందర్యాలతో అలరారుతున్న అద్భుత దృశ్య కావ్యం ఆంధ్ర ప్రదేశ్ అని తెలిపిన మంత్రి దుర్గేష్
-సీఎం, డిప్యూటీ సీఎం నేతృత్వంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తామని మంత్రి దుర్గేష్
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడాలని నిర్మాతలను కోరిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అనేక ప్రకృతి సౌందర్యాలతో అలరారుతున్న అద్భుత దృశ్య కావ్యం ఆంధ్ర ప్రదేశ్ అని, అందాల హరివిల్లు కు ప్రతిరూపమైన ఏపీలో సినిమా పరిశ్రమను ప్రోత్సహిస్తామని, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఫిల్మ్ పాలసీని తీసుకొస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం రాజమహేంద్రవరం లోని వేమగిరిలో జరిగిన గేమ్ చేజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఈ మేరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చిందిస్తుంది అనే అంశాలను వివరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళలు, భాష పట్ల ప్రత్యేక అభిమానం ఉన్న నాయకులని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాబోయే రోజుల్లో కొత్త ఫిల్మ్ పాలసీ తేవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగు సినిమా చరిత్రలో ఈ చిత్రం గేమ్ ఛేంజర్ గా నిలబడాలని ఆకాంక్షించారు. సినిమా సినిమాకి పరిణతి కనబరుస్తూ, అద్భుతమైన నటుడిగా, తండ్రికి తగ్గ తనయుడుగా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని తయారు చేసుకునే విధంగా రామ్ చరణ్ అద్భుతమైన నటన కౌశల్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి కొనియాడారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోదావరి తీరాన రాజమహేంద్రవరంలో ఒకే వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు దర్శకులను ఉద్దేశిస్తూ ఏపీలో చాలా చిత్రాలు తీస్తున్నారని మంత్రి అన్నారు.. రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందుకు రావాలని సీఎం, డిప్యూటీ సీఎం తరఫున మంత్రి దుర్గేష్ కోరారు.. ఇప్పటికే పర్యాటక రంగానికి కొత్త టూరిజం పాలసీ తెచ్చినట్టు, ఇండస్ట్రీకి ప్రత్యేక పాలసీ ఇచ్చినట్లుగా సినిమా రంగం లో కూడా కొత్త పాలసీని తీసుకొచ్చి ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా దేశంలోనే అత్యంత గొప్ప డైరెక్టర్ గా పేరు పొందిన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రం రూపుదిద్దుకోవడం సంతోషంగా ఉందన్నారు.. ఈ సందర్భంగా సినిమా నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడిన చిత్ర బృందానికి మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సినిమా నిర్మాత దిల్ రాజుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి నిర్మాతలంతా ఏపీని ప్రత్యేకంగా చూడాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *