Breaking News

Andhra Pradesh

అర్చకులు, ఫాదర్లు, ఇమామ్ ల సర్వమత ప్రార్థనలు…

-అడపా బాబ్జి ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి కొడాలి నాని పుట్టినరోజు వేడుకలు -భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి ఆధ్వర్యంలో శుక్రవారం గుడివాడ పట్టణం గంగానమ్మ వీధిలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా బాబ్జి జ్యూయలరీ షాపు ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. …

Read More »

మంత్రి కొడాలి నాని నివాసంలో అభిమానుల కోలాహలం…

-నిరాడంబరంగా జరిగిన పుట్టినరోజు వేడుకలు -భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు -శుభాకాంక్షలు తెలిపిన అధికార, అనధికార ప్రముఖులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నిరాడంబరంగా జరిగాయి. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసం రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన అభిమానులతో కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికార, అనధికార ప్రముఖులు మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్చాలను …

Read More »

కోవిడ్ కట్టడే లక్ష్యంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి…

-“జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం” పై క్షేత్ర స్థాయిలో సర్వే వివరాలు తెలుసుకోవడం జరిగింది.. -యంపీడీవో వెంకటరమణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నియంత్రణకు 18 నుంచి 45 లోపు వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకొని కరోనా వైరస్ ను కట్టడి చేయాలని ఎంపీడీవో ఎ.వెంకటరణ అన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన “మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్” కార్యక్రమాన్ని ఎంపీపీ గద్దె పుష్ప రాణి తో కలిసి యంపీడీవో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె …

Read More »

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల మేరకు కొవ్వూరు 23వార్డు కి సంబంధించిన కౌన్సిలర్ ఎం. రమేష్ మరణించడంతో ఏర్పడిన ఖాళీ ని భర్తీ చేసేందుకు సన్నాహాకాలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి పోలింగ్ కేంద్రాల పై ఎటువంటి అభ్యంతరాలు రాలేదని కొవ్వూరు మునిసిపల్ కమీషనర్. కె.టి.సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కమిషనర్ వారి కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ కొవ్వూరు పురపాలక …

Read More »

‘ఇంధన సామర్థ్య ఇళ్ల’లో ప్రపంచ శ్రేణి సాంకేతికత!

-28.3 లక్షల ఇళ్లలో ఎకో-నివాస్ సంహిత ఈసీబీసీ కోడ్ -ఇండో-స్విస్ బీఈఈపీ మద్దతుతో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం -పేద ప్రజలకు అత్యుత్తమ ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -ఈఎన్ఎస్ పూర్తిగా స్వచ్ఛందం.. తప్పనిసరేమీ కాదు.. -లబ్ధిదారుల సమ్మతితోనే ఈఎన్ఎస్ అమలు -గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ -దేశంలో మొత్తం విద్యుత్తు వినియోగంలో 38 శాతం నివాస భవనాలదే -ఏపీలో నివాస భవనాల రంగమే 17,154 మిలియన్ యూనిట్లు వినియోగిస్తోంది -మొత్తం వినియోగంలో ఇది 28 శాతం …

Read More »

విద్యా పధకాల పరిశీలనకు వచ్చిన అస్సాం బృందం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలవుతున్న విద్యాపధకాల అమలు తీరును పరిశీలించేందుకు అస్సాం బృందం రాష్ట్రానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయంలో అధికారులతో సమావేశానికి ముందుగా సచివాలయం లో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి సురేష్ ను అస్సాం బృందం సత్కరించింది. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అస్సాం బృందం రాష్ట్రంలో విద్యాకార్యక్రమాల అమలును పరిశీలించనున్నారు. అమ్మ ఒడి, నాడు …

Read More »

నవంబరు 30లోగా కోవిడ్ కారుణ్య నియామకాలు పూర్తి చేయాలి…

-రాష్ట్ర సచివాలయం మొదలు గ్రామస్థాయి వరకూ ఇ-ఆఫీసు విధానం అమలు చేయాలి -ఇకపై ప్రతినెల మొదటి బుధవారం కార్యదర్శుల సమావేశం -కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలి కోర్టు తీర్పులను సత్వరం అమలు చేయాలి -ఉద్యోగుల పదోన్నతులకు డిపిసి కేలండర్ల ప్రకారం చర్యలు తీసుకోండి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కోవిడ్ కారణంగా చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామకాలను నవంబరు 30వతేదీ లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …

Read More »

బద్వేలు ఉపఎన్నిక ముగిసే సమయానికి 72గం.ల ముందు ప్రచారం నిలిపివేయాలి : సిఇఓ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 30వతేదీన కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసే సమయానికి 72గం.ల ముందు అనగా (ఈనెల 27వతేదీ సా.7గం.ల నుండి 30వతేదీ సా.7గం.ల వరకూ)ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని నిలిపి వేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మరియు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ తెలియ జేశారు.పోలింగ్ ముగిసే సమయానికి 72గం.ల ముందు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయరాదని ముఖ్యంగా …

Read More »

పోలీసుల సేవలు ఎనలేనివి.. వెల కట్టలేనివి మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ అమరుల త్యాగాలు ఎంతో అమూల్యమైనవని, ప్రజా ప్రాణ రక్షణే కర్తవ్యంగా భావించి కరోనా మహమ్మారికి ఎదురొడ్డి సేవలందిస్తున్న మీ అంకితభావం చిత్తశుద్ధి వెలకట్టలేనిదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత పోలీసు అమర వీరుల స్థూపం వద్ద …

Read More »

రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణకు చేపట్టిన చర్యలపట్ల జాతీయస్థాయిలో ప్రశంసలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం 5 గంటలకు స్టేడియం చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 206 మంది అమరులైన పోలీసుల వివరాలతో కూడిన “అమరులు వారు” అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిఫదలష్కరించారు. పోలీస్ అమరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహనరెడ్డి …

Read More »