విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నియోజకవర్గ పరిధిలోని 7 వ డివిజన్, మొగల్రాజపురం,బందులదొడ్డి సెంటర్ లో స్థానిక కార్పొరేటర్, వైస్సార్సీపీ నాయకులతో కలిసి పర్యటించిన అవినాష్ ఇంటిఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను, ప్రభుత్వ పనితీరుపై వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన డివిజన్ పర్యటన ప్రజలు వద్దకు వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని,,వాటిని తప్పకుండా పరిష్కారం చేస్తానని ప్రజలకు హామీ …
Read More »Andhra Pradesh
20న రూ. 300 టీటీడీ దర్శన కోటా టికెట్ల విడుదల…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. ఈ నెల 20న ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. 20న ఉదయం 9 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్ (tirupatibalaji.ap.gov.in) తోపాటు ‘గోవిందా’ యాప్‌లోనూ టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 5 వేల టికెట్లను మాత్రమే విడుదల చేస్తుండగా మున్ముందు మరిన్ని టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
Read More »శబరిమలలో 17 నుంచి అయ్యప్ప దర్శనం…
తిరువనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని ఈ నెల 17 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. జులై 21 వరకు జరిగే పూజా కార్యక్రమాల కోసం ఈ అవకాశం కల్పించనున్నారు. కరోనా వ్యాక్సిన్ పొందినట్లు ధ్రువపత్రం, ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది. ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, 5 వేల మందికి మాత్రమే దర్శన అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
Read More »భవిష్యత్‌లో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు సమస్యలు రాకుండా చర్యలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి ఫలితాల విషయంలో విద్యార్థులకు మేలు జరిగేలా, ఎవరూ నష్టపోకుండా రాష్ట్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ‘ఆల్ పాస్’కు బదులు గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి వల్ల గత విద్యా సంవత్సరం(2019-20)లో పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ‘ఆల్ పాస్’గా ప్రకటించిన విద్యార్థులందరికీ తాజాగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది.ఆ విద్యా సంవత్సరంలో విద్యార్థులు రాసిన …
Read More »స్కోడా కుషాక్ 3000 కి పైగా బుకింగ్‌లతో అధిక స్పందన…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : స్కోడా కుషాక్ 3000 కి పైగా బుకింగ్‌లతో అధిక స్పందనను అందుకుంది. మహావీర్ స్కోడా హైదరాబాద్ (జూబ్లీహిల్స్, సోమాజిగుడ), ఆంధ్రప్రదేశ్ (విశాకపట్నం, విజయవాడ, నెల్లూరు, భీమవరం) లలో డెలివరీలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. వినియోగదారులు మహావీర్ స్కోడా హైదరాబాద్, ఏపీ వద్ద వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు. స్కోడా ఆటో ఇండియా మహావీర్ స్కోడా హైదరాబాద్, ఏపీ లో ఈ రోజు నుండి కొత్తగా ప్రారంభించిన కుషాక్ కస్టమర్ డెలివరీలను ప్రారంభించింది. కుషాక్ 28 జూన్ 2021 న …
Read More »ఆషాఢమాసం… శ్రీ వారాహి నవరాత్రులు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత… మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు. లలితా …
Read More »గ్రామీణ ప్రజల సాధికారత, స్వావలంబన, సుపరిపాలన నా ఆకాంక్ష: ఉపరాష్ట్రపతి
– సేంద్రియ పద్ధతులపై, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి జరగాలి -వ్యవసాయ ఎగుమతులు ఈ ఏడాది 18 శాతం మేర పెరగడం అభినందనీయం -నీటి ఎద్దడిని తట్టుకునే పంటలపై మరింత దృష్టిసారించాలన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -అసంఘటిత రంగమైన వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ చొరవతీసుకోవాలి -వ్యవసాయరంగంలో ఖర్చులు తగ్గించుకుంటే రాబడి సహజంగానే పెరుగుతుంది.. ఈ దిశగా పరిశోధనలు మరింత విస్తృతం కావాలి -ఈ రంగంపై మీడియా కూడా మరింత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సూచన హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »ఘనంగా శ్రీశైలంలో ఆషాఢ బోనాలు…
శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ఆషాఢ బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ యోగినిమాత సేవాశ్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు క్షేత్ర గ్రామదేవతలలో ఒకరైన మహిషాశురమర్థిని అమ్మవారికి శాస్రోక్త పూజలు నిర్వహించి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. సుమారు పది సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు భక్తులు తెలిపారు. బోనం అంటే భోజనం అని, గ్రామం సస్యశ్యామలంగా ఉండేలా వేడుకుంటూ మనస్పూర్తిగా అమ్మవారికి నైవేద్యం సమర్పించే సాంప్రదాయమే బోనాల పండుగ అని గురుమాత శ్రీ యోగినిమాత …
Read More »జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా టీడీపీ నిరసన కార్యక్రమం…
-శాసనసభ్యులు గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైకాపా ప్రభుత్వంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక కూరగాయలు అమ్ముకునే పరిస్థితులు దాపురించాయని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత ఆధ్వర్యంలో 6వ డివిజన్ మాచవరం బి.ఎస్.ఎన్.ఎల్ సమీపంలో జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత కూరగాయలు అమ్ముతూ తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ లక్షలాది మంది …
Read More »ఒక మహిళను చైర్ పర్సన్ గా నియమించడం సీఎం జగన్ ఆలోచనా విధానానికి నిదర్శనం…
-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిడింది, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతో చరిత్ర కలిగిన కలిదిండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి తొలిసారిగా ఒక మహిళను చైర్ పర్సన్ గా నియమించడం ముఖ్యమంత్రి జగనన్న ఆలోచనా విధానానికి నిదర్శనం అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కలిదిండి పిఏసిఎస్ ఛైర్ పర్శన్ ఊర కళ్యాణి, సభ్యులు, గొరిపర్తి వెంకటరెడ్డి, కమతం పరాంకుశం అభినందన సభలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి కలిదిండి సెంటర్ లో ఘనస్వాగతం పలికి …
Read More »