విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం నియోజకవర్గ పరిధిలోని 7 వ డివిజన్, మొగల్రాజపురం,బందులదొడ్డి సెంటర్ లో స్థానిక కార్పొరేటర్, వైస్సార్సీపీ నాయకులతో కలిసి పర్యటించిన అవినాష్ ఇంటిఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను, ప్రభుత్వ పనితీరుపై వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన డివిజన్ పర్యటన ప్రజలు వద్దకు వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని,,వాటిని తప్పకుండా పరిష్కారం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన అవినాష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చిన,అర్హత ఉండి ఏ సంక్షేమ పధకం అందకపోయిన తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ డివిజన్ ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన పార్క్ నిర్మాణం గురుంచి సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజలలో వ్యక్తం అవుతున్న సంతోషం చూస్తుంటే ఆయన నాయకత్వం లో పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని అవినాష్ అన్నారు. మా పాలన మీద నమ్మకంతోనే మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు 2300 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిని గెలిపించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకొనేవిధంగా పని చేస్తామని భరోసా ఇచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం గా పాలన సాగిస్తోంది అని కార్మికులను మోసం చేసి వారి బతుకులు బజారికీడ్చిన ఎంపీ కేశినేని నాని కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని విమర్శించే స్థాయి, అర్హత లేవని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ప్రజలలో రోజురోజుకి ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక టీడీపీ ఎంపీ కేశినేని నాని,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్యమంత్రి మీద చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని,వారు ఎన్ని కుట్రలు చేసిన అసత్యాలు ప్రచారం చేసిన ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. గత టీడీపీ ప్రభుత్వం లో తెలంగాణ లో అక్రమ కట్టడాలు ఎందుకు అడ్డుకోలేదు,విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతి కి పారిపోయి రావడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మీ బస్సుల వ్యాపారం కోసం అక్కడి వాళ్ళతో లాలూచీ పడిన చరిత్ర నీది కదా,కార్మికుల జీతాలు ఎగ్గొట్టి వారిని నడిరోడ్దు మీదకి లాగిన కేశినేని జగన్ గారి గురించి మాట్లాడటం విడ్డురం. మీ కూతురిని మేయర్ చేయడానికి విఫల యత్నాలు చేసిన నిన్ను మీ పార్టీ నాయకులు, కార్యకర్తలే నమ్మలేదు అలాంటి నువ్వు మా పార్టీ గురుంచి మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. ఓటు కి నోటు కేసు లో చంద్రబాబు ఇరుక్కున్న సమయంలో, హైదరాబాద్ పై మనకి హక్కు ఉన్నప్పటికీ దానిని వదిలేసి విజయవాడకి పారిపోయి వచ్చారు. తన వ్యాపారాలు,ఆస్తులు కాపాడుకోవడానికే ఎంపీ నాని నోరు మూసుకొని ఉన్నాడు. ఇక షో మాస్టర్ గద్దె రామ్మోహన్ ఇన్ని రోజులు తన డ్రామాలతో,షో రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచారని,ఇక మీ ఆటలు సాగవు అని అర్థం అయ్యి ఇప్పుడు మరల చిల్లర రాజకీయాలు మొదలుపెట్టారని,ఒకసారి జూమ్ అప్ నుండి బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వం లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో యువతకు చూడాలని,జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. జగన్ హుందాగా పెద్ద తరహాలో అక్కడ నివసించే మన రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించి,మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడుతుంటే,టీడీపీ నాయకులు వారి రాజకీయ లబ్ది కోసం జల వివాదాలు సృష్టించాలని చూడటం నీచమని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ గారిదే అని,ఇంకోసారి మీ రాజకీయ మనుగడ కోసం ఇలాంటి షో రాజకీయాలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి,వేగే వెంకటేశ్వరరావు,దుర్గగుడి ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ సుజాత,వైసిపి నాయకులు సొంగ రాజ్ కమల్, కుటుంబరావు,సంపంత్, తోకల శ్యామ్,క్లైవ్ తదితరులు పాల్గొన్నారు.
