తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. ఈ నెల 20న ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. 20న ఉదయం 9 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్ (tirupatibalaji.ap.gov.in) తోపాటు ‘గోవిందా’ యాప్‌లోనూ టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 5 వేల టికెట్లను మాత్రమే విడుదల చేస్తుండగా మున్ముందు మరిన్ని టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
Tags tirumala
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …