Breaking News

Telangana

ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24వ తేదీన నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి… : కలెక్టరు జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఆదేశాల మేరకు మండల ప్రజాపరిషత్తు అధ్యక్షులు, ఉపాధ్యక్షుల, కోఆప్టెడ్ మెంబరు ఎన్నిక కొరకు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24వ తేదీన నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మండల ప్రజాపరిషత్తు ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా కలెక్టరు జె.నివాస్ సూచించారు. యంపిపి కోఆప్టెడ్ మెంబరు ఎన్నిక నిమిత్తం ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు మండల ప్రజాపరిషత్తు సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సమావేశానికి సంబంధిత యంపిటిసిలు హాజరయ్యేలా సంబంధిత …

Read More »

త్వరలో ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి చర్యలు…

-ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం -సినిమా పరిశ్రమకు సంబంధించిన స్టేక్ హోల్టర్లతో సమావేశమై వారి అభిప్రాయాలన్నీ తీసుకున్నాం -ఆన్లైన్ టికెట్ల అంశంపై స్టేక్ హోర్డలందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు -రాష్ట్ర సమాచార,రవాణాశాఖమాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో ఆన్లైన్ బుకింగ్ విధానంలో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,రవాణా శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు.సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో …

Read More »

జిల్లాలో 15వ ఆర్థిక సం ఘం నిధులతో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కోసం రూ. 41.96 కోట్లు… : జిల్లా కలెక్టరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలన్నింటినీ అభివృద్ధి చేసేందుకు 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 41.96 కోట్ల రూపాయలు కేటాయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని జిల్లా కలెక్టరు జె.నివాస్ చెప్పారు. సోమవారం స్థానిక కలెక్టరు కార్యాలయ సమావేశ భవనంలో జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. డియం హెచ్ఓ డా. యం. సుహాసిని, డిపిఓ జ్యోతి, జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య కేంద్రాలన్నీ వచ్చే …

Read More »

ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంపై  వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు ఖరారుచేసిన అధికారులు పథకం అమలుకోసం రూపొందించిన విధివిధానాలపై సమావేశంలో చర్చ ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు సెప్టెంబరు 25 నుంచి డేటాను అప్‌లోడ్‌ చేయనున్న ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ …

Read More »

పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వీడియో సందేశం… దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో గతంలో ఎప్పుడూ చూడని అపూర్వ విజయం మధ్య ఈరోజు నేను మాట్లాడుతున్నాను. పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు; శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటి ఘన విజయం అందించిన ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు; …

Read More »

ఎన్.యస్.యు.ఐ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ (స్టేట్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్)గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ నియామకం… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ (స్టేట్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్)గా నియమించడం జరిగింది. తన పై నమ్మకం వుంచి మరలా రెడవసారి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ నగేష్ కరియప్పలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ… భవిష్యత్తులో ఎన్.యస్.యు.ఐ. బలోపేతం చేయడానికి నావంతు కృషి చేస్తానని, రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల …

Read More »

సమిష్టి నిర్ణయాలతో ఆదర్శంగా నిలుపుదాం… : ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి  

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ సభ్యుల నిర్ణయాలతో గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసేలా సమిష్టి నిర్ణయాలతో ఆదర్శంగా నిలుపుదామని ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి పేర్కొన్నారు. సోమవారం కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ లో అత్యవసర సమావేశానికి ఛైర్ పర్సన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ కోర్ట్ ఉత్తర్వులు మేరకు కాంట్రాక్టర్ కి చెల్లింపు చెయ్యవలసిన సుమారు రూ.11 లక్షలు సాధారణ నిధుల నుండి చెల్లించడానికి సభలో ప్రవేశ పెట్టిన అంశాన్ని కౌన్సిల్ …

Read More »

మండల, సచివాలయ స్థాయిలో తీసుకునే ప్రతి ఫిర్యాదు కి రసీదులు ఇవ్వాలి.. : జేసి (ఆసరా) పి.పద్మావతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా), కొవ్వూరు ఇంఛార్జి ఆర్డీవో పి. పద్మావతి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా పి. పద్మావతి మాట్లాడుతూ, ప్రజలు అందచేసే వినతుల పరిష్కారానికి జవాబుదారీతనం తో అధికారులు, సిబ్బంది వ్యవహరించాల్సి ఉందన్నారు. ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోందన్నారు. ప్రజలు అందించే దరఖాస్తు …

Read More »

కొవ్వూరు మండల వనరుల కేంద్రాన్ని, జెడ్పీ బాలికల పాఠశాల, ఎమ్ పిపి స్కూల్స్ ను ఆకస్మిక తనిఖీ…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రెండో దశ నాడు నేడు కింద పాఠశాలలో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చెయ్యడం జరుగు తుందని విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల డి. మధుసూదన్ రావు తెలిపారు. సోమవారం కొవ్వూరు మండల వనరుల కేంద్రాన్ని, జెడ్పీ బాలికల పాఠశాల, ఎమ్ పిపి స్కూల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసారు.  ఈ సందర్భంగా మధుసూదన్ రావు, మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన నాడు నేడు …

Read More »

సమస్యల పరిష్కారానికి సత్వరమే స్పందించండి… : సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్

-స్పందనలో 69 అర్జీల రాక… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధసమస్యల పరిష్కారానికి 69 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి. ఎస్ఎస్ ప్రవీణ్ చంద్. తెలిపారు.వీటిలో అత్యధికంగా రెవెన్యూ 23, పురపాలక 15, పోలీస్ శాఖ 3, సెర్ప్ 11, పంచాయతీరాజ్ 9, ఇతర శాఖలు 8 చొప్పున మొత్తం 69 దరఖాస్తులు అందాయన్నారు.నడిచేందుకు వీలుకాని పరిస్థితుల్లో ఉన్న విభిన్న ప్రతిభావంతురాలైన విజయవాడకు చెందిన తిరుమల కొండ పూజిత కు …

Read More »