Breaking News

డెకాయట్ ఆపరేషన్స్ కు సహకారం అందించాలి

– లింగా నిర్ధారణ వివరాల తెలియడం సెక్స్ రేషన్ తగ్గడానికి కారణం కావచ్చు
– స్కానింగ్ సెంటర్స్ తనిఖీల్లో లోపాలు మరో కారణం
– డి ఎమ్ హెచ్ వో కె వెంకటేశ్వర రావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి స్కానింగ్ సెంటర్ లోనూ ఒపి రూమ్, రిజిస్ట్రేషన్ కౌంటర్, స్కానింగ్ రూమ్ బయట, లోపల గర్భ నిర్ధారణ పరీక్షలు నేరమన్న ఫ్లెక్సీలను ప్రముఖంగా ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు ఆదేశించారు శనివారం ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ (ఐ యం. ఎ.) హాలు యందు డాక్టర్ కె. వెంకటేశ్వర రావు డిఎంహెచ్వో అధ్యక్షతన జిల్లాలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు మరియు జిల్లాలోని గవర్నమెంట్ స్కానింగ్ సెంటర్స్ కు పీసీపీఎన్డిటి యాక్ట్ అమలు చేస్తున్న తీరు, సంస్థగత నిర్మాణం పై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ , గర్భస్థ నిర్ధారణ నిబంధనలకు మీరినటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జనాభా పెరుగుదల లో లింగ నిష్పత్తి లో వ్యత్యాసం కనిపిస్తున్న దృష్ట్యా ప్రతి స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధం అనే బోర్లను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. రిజిస్టర్ స్కానింగ్ సెంటర్స్ నిర్దేశించిన విధంగా ఫారం ఎఫ్ లు ప్రతినెల ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని తెలియజేశారు. సమాజంలో జెండర్ లింగా నిష్పత్తి సమానత్వం యొక్క ప్రాముఖ్యత ను విస్మరిస్తూ, బాలికల ప్రాధాన్యత ను తెలియ చేశారు. వివిధ స్కాన్నింగ్ సెంటర్స్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంలో, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకి ఆయా సందర్భాల్లో డెకాయట్ ఆపరేషన్స్ కు సహకారం అందించాలనీ కోరారు.లింగా నిర్ధారణ వివరాల తెలియడం సెక్స్ రేషన్ తగ్గడానికి కారణం కావచ్చు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ క్రమంలో స్కానింగ్ సెంటర్స్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. అధికారులు స్కానింగ్ సెంటర్స్  తనిఖీల్లో లోపాలు మరో కారణం అవుతోందని, కావున క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించే క్రమంలో బాధ్యతతో కూడిన సహకారం అందించాలని పేర్కొన్నారు. జెండర్ బేస్డ్ వైలెన్స్ ఎండ్ మెడికో లీగల్ కేర్ ఫర్ సూపర్వైజర్ వైలెన్స్ మీద స్కానింగ్ సెంటర్స్ కి ట్రైనింగ్ అందించడం జరిగింది.. ట్రైనింగ్ నందు డాక్టర్ పి ఎస్ ఎల్ ప్రసన్న మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ యందు గర్భిణీ స్త్రీలు స్కానింగ్ చేసినప్పుడు వారికి గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు జరపరాదని లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడైనా జరిగితే వాటికి భారతీయ శిక్షాస్మృతిలో 1994 యాక్ట్ ప్రకారం మొదటిసారి వారికి రూ.50 వేలు జరిమానా ఒక సంవత్సరం జైలు శిక్ష విధించి వారికి లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఇటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా పోలీస్ సిబ్బంది , రెవిన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో డకాయట్ ఆపరేషన్స్ కి సహకరించాలని ఆమె కోరారు . ఈ యాక్ట్ ఉద్దేశాన్ని లాయర్ భయ్యి రాము వివరిస్తూ ప్రతి స్కానింగ్ సెంటర్ కి యాక్ట్ ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానా మరియు జైలు శిక్ష విధించబడుతుందని అవసరమైన మేరకు స్కానింగ్ సెంటర్ ని సీజ్ చేయడం , లైసెన్సు రద్దు చెయ్యడం జరుగుతుందని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎమ్ హెచ్ వో డాక్టర్ సంధ్య మాట్లాడుతూ డకేఐటీ ఆపరేషన్లు జరిగి ఉన్నప్పుడు ఏదైనా స్కానింగ్ సెంటర్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తొస్తే వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరత్నం మాట్లాడుతూ ఫోక్సో యాక్ట్ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నర్సమ్మ మాట్లాడుతూ బాలికలపై వివక్ష చూపరాదని ఆడపిలైన, మగపిల్లా వాడైన ఒక్కలా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో సత్య కుమార్ నల్లూరి, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *