Breaking News

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాజానగరం నియోజకవర్గం లోని ఎంపిడిఓ కార్యాలయం ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీన ” జాబ్ మేళ” నిర్వహించ నున్నట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పేరుమాళ్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో 3 ప్రముఖ కంపనీలు హాజరుకానున్నట్లు తెలిపారు. వీటిలో గల వివిధ ఉద్యోగాలలో పనిచేయడానికి ఐ టి ఐ, డిప్లొమా , బి టెక్,యం బి ఎ, బి/యం /డి ఫార్మసీ , డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల వారు అర్హులని ఆయన వివరించారు. ఆ రోజున నిర్వహించే ” జాబ్ మేళా” కు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి , తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి సదరు ” జాబ్ మేళా” కు రెజ్యూమెలతో పాటు ఆధార్, ఇతర సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో, సిద్ధపడి ఈనెల 30వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయం రాజానగరం వద్దకు రావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పేరుమాళ్, జిల్లా ఉపాధి సంస్థ అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు.
మరిన్ని వివరాలకు “9988853335,8712655686, 8790118349,8790117279.” నంబర్ల ను సంప్రదించాలని సూచించారు.( సంప్రదించాల్సిన సమయం 10 Am to 5Pm)

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *