Breaking News

కలెక్టర్ల తో డిసెంబరు 30 న రెవెన్యు మంత్రి ప్రాంతీయ సదస్సు కలెక్టరు ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రెవిన్యూ విభాగంలో ఆధ్వర్యంలో చేపడుతున్న పౌర సేవలకు చెందిన ప్రగతి పై రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి  అనగని సత్య ప్రసాద్ డిసెంబరు 30 న జిల్లా కలెక్టర్ లతో అమరావతిలో ప్రాంతీయ సదస్సు లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. శనివారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి, కలక్టరేట్ పరిపాలన అధికారి ఎమ్. అలీ లతో రెవిన్యూ అంశాలపై కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సు లని పూర్తి స్థాయిలో విజయవంతం చెయ్యడంలో స్ధానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో ఆయా గ్రామ రెవెన్యూ సదస్సు లని నిర్వహించడం జరుగుతున్నట్లు తెలిపారు. రెవిన్యూ శాఖ మంత్రి కలెక్టర్ల తో నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సు లో ఫ్రీహోల్డ్ / తదుపరి రిజిస్టర్ చేయబడిన ఫ్రీహోల్డ్ భూముల యొక్క పునఃపరిశీలన స్థితి, ప్రజా సమస్యల పరిష్కార విధానం) PGRS, నీటి పన్ను, ప్రభుత్వ లే భూముల రక్షణ, ఆక్రమణల క్రమబద్ధీకరణ, ఇంటి స్థలాల స్థితి, గ్రామసభ ఫిర్యాదుల పరిష్కార స్థితి, సర్వే రాయిపై పేర్ల తొలగింపు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. ఈ క్రమంలో జిల్లా, రెవిన్యూ డివిజన్, మండల స్థాయి పనితీరుపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. గ్రామ రెవెన్యూ సదస్సు లలో వొచ్చిన అర్జీలను తప్పనిసరిగా పిజిఆర్ఎస్ పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. పి జి ఆర్ ఎస్ ద్వారా ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి, మంత్రుల, రాష్ర్ట ఉన్నతస్థాయి అధికారుల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అజెండా అంశాలకు సంబంధించి నివేదికలతో క్షేత్ర స్థాయి అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆమేరకు సమన్వయం చేసుకోవాలనీ జిల్లా రెవిన్యూ అధికారి నీ కలెక్టరు ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *