Breaking News

 పొరుగు సేవలు విధానంలో మైక్రో ఇరిగేషన్ ఇంజనీరు పోస్టు భర్తీ

– దరఖాస్తు చేసుకునేందుకు చివరి జనవరి 18
-మౌఖిక ఇంటర్వూలు జనవరి 21
– పిడి దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పొరుగు సేవలు విధానంలో మైక్రో ఇరిగేషన్ ఇంజనీరు పోస్టును భర్తీ కోసం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ల కు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా, ఎ.పి.ఎం.ఐ.పి., పథక సంచాలకులు/ జిల్లా సూక్ష్మ సేద్య అధికారి ఏ దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. సదరు పోస్టు కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకము (ఎ.పి.యమ్.ఐ.పి), తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం వారి కార్యాలయములో విధులను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ఖాళీగా వున్న మైక్రో ఇరిగేషన్ ఇంజనీరు పోస్టును పొరుగుసేవలు (అవుట్ సోర్సింగ్-ఎ.పి.సి.ఒ.యస్) ద్వారా భర్తీ చేయుటకు, బి.టెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) విద్యార్హత కలిగిన అభ్యర్దుల నుండి దరఖాస్తులను కోరుచున్నాము. కావున, ఆసక్తిగల అభ్యర్దులు వారి యొక్క దరఖాస్తుతో పాటు యస్.యస్.సి, ఇతర విద్యార్హతలు మార్కుల జాబితా మరియు “కుల దృవీకరణ” పత్రములను విధిగా జతపరచి, ఈ కార్యాలయ ఇ-మెయిల్ apmiprecruitment@gmail.com కు తేది 18.01.2025 సాయంత్రం 5.00 గం. లోపు పంపవలెను మరియు తేదీ 22.01.2025 ఉదయం 10.30 గం.లకు వైటిసి భవనం, రూరల్ తహసిల్దార్ కార్యాలయం ప్రక్కన, బొమ్మురు నందు గల ఎపిఎమ్ఐపి కార్యాలయం వద్ద జరుగు మౌఖిక పరీక్షకు అన్ని ధృవ పత్రములతో, ఒక ప్రతి నకలుతో హాజరు కావలెనని తెలియ చేశారు. ఇతర వివరములకు సెల్ నెంబరు 7995087141 ను కార్యాలయ పనీ వేళల్లో సంప్రదించాలని తెలియచేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *