Breaking News

Telangana

ఇంతవరకు 3.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు… : జెసి డా. కె. మాధవీలత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాల రబీ ధాన్యం కొనుగోలు భాగంగా ఇంతవరకు 34,051 రైతుల నుంచి 3,95,738 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 10మంది రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 34,051 మంది రైతుల నుంచి …

Read More »

సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెనమలూరుకు చెందిన కౌలు రైతు మోర్ల నాగభూషణం ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పై శనివారం విజయవాడ సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్ విచారణ నిర్వహించారు. సదరు రైతు కుటుంబానికి ప్రభుత్వ ఉత్తర్వులు 102 ప్రకారం ఆర్ధిక సహాయం మంజూరు చేసేందుకు విచారణ చేపట్టిన్నట్లు సబ్ కలెక్టరు ప్రవీణ్ చంద్ తెలిపారు. పెనమలూరులోని మోర్ల నాగభూషణం ఇంటి వద్ద విజయవాడ ఈస్ట్ అసిస్టెంట్ కమిషనరు ఆఫ్ పోలీస్ భాషా, వ్యవసాయ …

Read More »

కోవిడ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే వ్యాపారస్థులపై చర్యలు…

-వినియోగదారులు నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యాపారులదే… -సానుకూలంగా స్పందించిన వ్యాపారస్థులు… -కోవిడ్ పై వ్యాపారులతో కలెక్టరు, సిపి సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారులు కోవిడ్ నియమనిబంధనలు పాటించేలా చూడవలసిన బాధ్యత వ్యాపారస్థులపై ఉందని ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకునే అవకాశం తమకు కల్పించవద్దని వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలకు జిల్లా కలెక్టరు జె. నివాస్, పోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు స్పష్టం చేశారు. వ్యాపార వాణిజ్య సముదాయాలలో కోవిడ్ నిబంధనలు పాటించడం పై వర్తక, వాణిజ్య, హోటల్ అసోసియేషన్స్, …

Read More »

వీరబాబు స్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణం వెనుక భాగాన ఉన్న వీరబాబు స్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ  కరీమున్నీసా తో కలిసి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ జీవితంలో ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలన్నారు. గత తెలుగుదేశం హయాంలో విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో ఆలయాలను కూల్చివేశారన్నారు. చిన్న ఆలయాల నుంచి శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న పురాతన …

Read More »

విద్యార్థులు సక్రమ మార్గంలో నడవాలంటే గురువులే కీలకం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశానిదని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు అన్నారు. గురుపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా సాయిబాబా మందిరాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. కాకాని నగర్ అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద ఉన్న శ్రీ కళ్యాణ సాయిబాబా మందిరంలో జరిగిన పూజా కార్యక్రమాలలో  శాసనసభ్యులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గురుపౌర్ణమి రోజున గురువులను పూజించడం …

Read More »

శాకంబరీ మాత ఉత్సవాలలో భాగంగా పలు ఆలయాలను దర్శించిన ఎమ్మెల్యే  మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో శాకాంబరి మాత ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. మూలవిరాట్టు విగ్రహంతోపాటు ఆలయ ప్రాంగణాన్ని దేవస్థానం సిబ్బంది వివిధ రకాల కూరగాయలు, పండ్లతో నయన మనోహరంగా అలంకరించారు. ఈ పూజా కార్యక్రమాలలో శాసనసభ్యులు  మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనంతో పాటుగా.. తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ శాకంబరీ దేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ …

Read More »

కేసులు నమోదు చేయడం లేదు అవగాహన పెంచుతున్నాం :  కలెక్టర్ జె నివాస్

-నో మాస్ నో రైడ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోన థర్డ్ వేవ్ హెచ్చరికలు మేరకు పలుమార్లు ఆటోడ్రైవర్లకు ప్రజలకు క్షేత్రస్థాయిలో డిటిసి ఆధ్వర్యంలో తనిఖీల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ జె నివాస్ తెలిపారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారంనాడు ఆర్టీఏ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా చేపట్టిన వివరాలను స్థానిక డిటిసి కార్యాలయం నుండి విడుదల చేశారు. ఈ సందర్భంగా డిటిసి యం పురేంద్ర మాట్లాడుతూ …

Read More »

పశ్చిమ నియోజకవర్గం లోని పలు సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలలో పాల్గొన్న పోతిన వెంకట మహేష్… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురుపౌర్ణమి సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్  పశ్చిమ నియోజకవర్గం లోని పలు సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలలో పాల్గొని, కరోనా రాష్ట్రం నుండి పూర్తిగా తొలగిపోవాలని, ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, వారి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనే లాగా సాయిబాబా దీవెనలు అందించాలని, మహేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దూది ఫ్యాక్టరీ వీధిలో గల సాయిబాబా మందిరాన్ని మొదటగా సందర్శించిన్నారు, మహేష్ కి హరిబాబు  శాలువాతో …

Read More »

గోచిపాక శ్రీనివాస్, కాకుమాను రాజశేఖర్ లను కలిసిన ఒగ్గు గవాస్కర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ స్టేట్ గెస్ట్ గౌస్ నందు శనివారం 32 వ డివిజన్ కో ఆర్డినేటర్ మరియు న్యాయవాది ఒగ్గు గవాస్కర్  కొత్తగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబెర్ గా నియమితులైన గోచిపాక శ్రీనివాస్ ని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లిడ్కాప్ చైర్మన్ గా నియమితులైన కాకుమాను రాజశేఖర్ ని కలిసి అభినందనలు తెలియజేశారు.

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శనివారం స్థానిక 6 వ డివిజిన్ లో జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో కార్పొరేటర్ అమర్నాధ్ తో కలిసి పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం …

Read More »