Breaking News

Daily Archives: May 19, 2024

గణనాయకాష్టకమ్‌!!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : (సర్వకార్యసిద్ధికి) ఏకదంతం మహాకాయం – తప్తకాంచనసన్నిభమ్‌ లంబోదరం విశాలాక్షం – వందేహం గణనాయకమ్‌. చిత్రరత్నవిచిత్రాంగం – చిత్రమాలావిభూషితమ్‌ కామరూపధరం దేవం – వందేహం గణనాయకమ్‌. గజవక్త్రం సురశ్రేష్ఠం – కర్ణచామరభూషితమ్‌ పాశాంకుశధరం దేవం – వందేహం గణనాయకమ్‌ మూషకోత్తమ మారుహ్య – దేవాసురమహాహవే యోద్దుకామం మహావీర్యం – వందేహం గణనాయకమ్‌. యక్షకిన్నరగంధర్వ సిద్ద విద్యాధరై స్సదా స్తూయమానం మహాబాహుం – వందేహం గణనాయకమ్‌. అంబికాహృదయానందం – మాతృభి: పరివేష్టితమ్‌. భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్‌. సర్వవిఘ్నహరం దేవం …

Read More »

తెలంగాణ ఎప్‌సెట్‌లో ఏపీ విద్యార్థులు టాప్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ఎప్‌సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్ విభాగంలో సతివాడ జ్యోతిరాదిత్య (పాలకొండ), గొల్లలేఖ హర్ష (కర్నూలు), మురసాని సాయియశ్వంత్ రెడ్డి (కర్నూలు), పుట్టి కుషాల్‌కుమార్ (అనంతపురం), ధనుకొండ శ్రీనిధి (విజయనగరం) టాప్‌-10లో ఉన్నారు. అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో అలూరు ప్రణీత (మదనపల్లి), నాగుదాసరి రాధాకృష్ణ (విజయనగరం), సోంపల్లి సాకేత్ రాఘవ (చిత్తూరు) టాప్‌-10లో ఉన్నారు.

Read More »

తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి…

-కిర్గిజ్ స్తాన్ (బిష్కెక్)లో ఉంటున్న భారతీయ పౌరులకు భారత విదేశాంగ శాఖ ముఖ్య గమనిక తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కిర్గిజ్ స్తాన్ దేశంలో, ఒక ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులు,విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే కిర్గిజ్ స్తాన్ లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ 0555710041 ను సంప్రదించాలని సూచిస్తూ భారత విదేశాంగ శాఖ 18.05.24 తేదీన మార్గదర్శకాలు జారీ చేసింది. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది అని తెలిపింది. …

Read More »

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం, తూర్పు గోదావరి జిల్లా యందు వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవములు -2024 సందర్భంగా ఈరోజు శ్రీ స్వామివారికి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి తరపున గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, ఐఏఎస్ చేతుల మీదుగా పట్టు వస్త్రములు సమర్పించుట జరిగినది. ఈ సందర్బంగా వీరు ఆలయ అర్చక బృందంతో కలిసి అన్నవరం దేవస్థానం చేరుకోగా ఆలయ కార్యనిర్వహణాధికారి (అన్నవరం) రామచంద్ర మోహన్ …

Read More »

పోల్డ్ ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ లను జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పోల్డ్ ఈవిఎం లను భద్ర పరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లను జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ గారు అధికారులకు సూచిస్తూ మరింత అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని, కౌంటింగ్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఆదివారం సాయంత్రం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం …

Read More »

యువ ఆపద మిత్ర…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విపత్త్తు నిర్వహణ సంస్థ వారు భారత్ స్కౌట్స్ & గైడ్స్ సంస్థలో శిక్షణ పొందిన యువతి యువకులకు (18 సంవత్సరముల నుండి 40 సంవత్సరములలోపు ఉన్న వారికీ) యువ ఆపద మిత్ర అను పధకమును ప్రవేశపెట్టియున్నారు. దీని యొక్క ఉద్దేశ్యం మీ మీ సమీప ప్రాంతములలో ప్రకృతి వైపరీత్యాలు (వరదలు, భూకంపాలు, సునామీ వంటివి) సంబవించినప్పుడు జాతీయ విపత్త్తు నిర్వహణ సంస్థతో పాటు సహాయము చేయుట కొరకు, దీని కొరకు జాతీయ విపత్త్తు నిర్వహణ సంస్థ …

Read More »

ఎయిడ్స్ వ్యాధిని అంతమొందిచడంలో బాగస్వాములవుదాం

-ఎయిడ్స్ బాధిత కుటుంబాలకు అండగా నిలుద్దాం.. జిల్లా రెవెన్యూ అధికారి వి.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా రూపుమాపడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి చేయడంతోపాటు ఎయిడ్స్ బాధిత కుటుంబాలకు అండగా ఉందామని జిల్లా రెవెన్యూ అధికారి వి.శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవ సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కలిసి …

Read More »

కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలి… : కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు. జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీ రావు నియోజవర్గ రిటర్నింగ్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని అదేవిధంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకరాలను పాటిస్తూ …

Read More »

కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలి

-ఎన్నికల సంఘాన్ని కోరిన వైసీపీ బృందం -4 అంశాలపై ఫిర్యాదులను అందించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయం నందు అడిషనల్ సీఈవో కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు. …

Read More »

అండమాన్‌ తీరాన్ని తాకిన రుతుపవనాలు..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఏడాది ఎల్​నినో ప్రభావానికి తోడు బిఫర్​జాయ్​ తుఫాన్‌ కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. రెండు వారాలు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించడంతో.. సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది. కానీ.. ఈ సారి నైరుతి సాధారణ సమయానికే వస్తుండడంతో జూన్ 1కల్లా కేరళ గుండా దేశంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాల రాకతో ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాలు అండమాన్‌ తీరాన్ని తాకాయి.. ఈ నెల …

Read More »