Breaking News

Daily Archives: July 9, 2024

మద్యం అక్రమ రవాణా, అక్రమ నిల్వ, సారా అమ్మకాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా తనిఖీలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, సెబ్ అధికారులు మద్యం అక్రమ నిల్వలు, కల్తీ మద్యం, సారా విక్రయం జరగకుండా నివారణ, నియంత్రణ చర్యలు చేపడుతూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఎట్టి పరిస్థితిలోనూ ఉల్లంఘనలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, సెబ్ అధికారులతో కలెక్టర్ మద్యం అమ్మకాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ మద్యం అక్రమ నిల్వలు, అక్రమ సారా …

Read More »

పరిశ్రమలలో నిబంధనల మేరకు భద్రతా ప్రమాణాలు పాటించాలి

-అధికారులు పరిశ్రమల తనిఖీ ఎప్పటికప్పుడు చేపడుతూ పర్యవేక్షణ ఉండాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమలలో నిబంధనల మేరకు భద్రతా ప్రమాణాలు పాటించాలని, అధికారులు పరిశ్రమల తనిఖీ ఎప్పటికప్పుడు చేపడుతూ పర్యవేక్షణ ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమలలో భద్రత చర్యలపై కలెక్టర్ సమీక్షిస్తూ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అమలు, వాటిపై పర్యవేక్షణ ఉండాలని, ప్రమాదాల నివారణకు తరచూ సంబందిత అధికారులు సేఫ్టీ మెజర్మెంట్ …

Read More »

సచివాలయ ఉద్యోగులకు వివిధ శాఖల్లో పదోన్నతులు కల్పించాలని, ఉద్యోగులను మాతృ శాఖలకు అప్పగించాల… : ఎం.డి.జాని పాషా

-గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మరియు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం మరియు పురోగతి కోసం ప్రభుత్వం త్వరలో అత్యున్నత కమిటీ ఏర్పాటు చేస్తుంది :ఎం.డి.జాని పాషా రాష్ట్ర అధ్యక్షుడు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ -సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు శివప్రసాద్ తో సమావేశమై సమస్యలపై చర్చించి వినతిపత్రం అందించిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం,మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమం …

Read More »

ఉచిత ఇసుక వినియోగ దారులకు, గృహ నిర్మాణ లబ్దిదారులకు అందుబాటులోకి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పెండ్యాల, పందలపర్రు ఇసుక స్టాక్ పాయింట్స్ వద్ద ఈరోజు నుంచి ఉచిత ఇసుక వినియోగ దారులకు, గృహ నిర్మాణ లబ్దిదారులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఆర్ ఎం సి మునిసిపల్ కమిషనర్ కె.. దినేష్ కుమార్ తెలియ చేసారు. మంగళవారం సాయంత్రం నిడదవోలు మండలం పరిథిలో ని పెండ్యాల, పందలపర్రు స్టాక్ పాయింట్ లని సబ్ కలెక్టరు అశుతోష్ శ్రీవాత్సవ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, …

Read More »

ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ప్రారంభించిన శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు, సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్యులకు ఇసుక అందుబాటులో తీసుకుని రావడం లో లాంఛనంగా ఈరోజు ప్రారంభించడం జరిగిందని శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కుమార దేవరం గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, కూటమి నాయకులతో కలిసి శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, కొవ్వూరు నియోజక వర్గ పరిథిలో ఇళ్లను నిర్మించుకునే వినియోగదారులకి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా …

Read More »

కాతేరు స్టాక్ పాయింట్ ను తనిఖి చేసిన ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కె.. దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం మధ్యాహ్నం స్ధానిక కాతేరు ఇసుక స్టాక్ పాయింట్ ను ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, కాతేరు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద సుమారు 7 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులొ ఉందని, ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు వినియోగదారులకి పారదర్శకంగా ఇసుక పంపిణీ చేయాల్సి ఉందన్నారు. నియమ నిబంధనలు అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దినేష్ కుమార్ హెచ్చరించారు. ఇంటి ప్లాన్ …

Read More »

రానున్న 2027 గోదావరి పుష్కరాలు నాటికి ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం

-పర్యాటకపరంగా ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతాం -ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది – పర్యట శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మిక , ఇకో, మెడికల్ టూరిజం అభివృద్ది లక్ష్యంగా పర్యాటక ప్రాంతంగా రాజమహేంద్రవరం నగరాన్ని తీర్చిదిద్దడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురందేశ్వరి, కలెక్టర్ ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య …

Read More »

జనాభా నియంత్రణ భూమికి ఒక వరం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11వ తేదీ, 1987న జనాభా ఐదు బిలియన్లకు చేరిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పాలకమండలి ప్రతి సంవత్సరం నిర్వహించడానికి నిర్ణయించడమైనది. దీనిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన నినాదంతో ప్రజలలో జనాభా పెరుగుదల తో ముడిపడి ఉన్న ఆరోగ్యం ,ఆర్థికం, పునరుత్పత్తి, పర్యావరణం మొదలైన వాటి పై కలిగే ప్రతికూల అంశాలను చర్చించుటకు ,అవగాహన కల్పించుటకు జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి .గీతాబాయి …

Read More »

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల పట్ల అవగాహన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల పట్ల అవగాహన కల్పించి నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలని, ఇందుకోసం వివిధ కళాశాలలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. అగ్ని వీరు పథకంలో భాగంగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ లో అగ్ని వీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో, భారత వాయుసేనకు చెందిన నాన్ కమిషన్ ఆఫీసర్ ఎన్. సందీప్, జిల్లా ఉపాధి కల్పనాధికారి డి. విక్టర్ బాబు …

Read More »

బిసిల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి

-నిధులు ఇవ్వకుండా బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు -బిసి సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు, బలహీన వర్గాల ద్రోహిగా వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్ ఎస్ సవితమ్మ అభివర్ణించారు. నా బిసి, నా బడుగులని ఓట్లు వేయించుకొని బీసీలను అన్ని రంగాలలో మోసం చేశారని మండిపడ్డారు. బీసీల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే అని మంత్రి …

Read More »