మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11వ తేదీ, 1987న జనాభా ఐదు బిలియన్లకు చేరిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పాలకమండలి ప్రతి సంవత్సరం నిర్వహించడానికి నిర్ణయించడమైనది. దీనిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన నినాదంతో ప్రజలలో జనాభా పెరుగుదల తో ముడిపడి ఉన్న ఆరోగ్యం ,ఆర్థికం, పునరుత్పత్తి, పర్యావరణం మొదలైన వాటి పై కలిగే ప్రతికూల అంశాలను చర్చించుటకు ,అవగాహన కల్పించుటకు జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి .గీతాబాయి అధ్యక్షతన ప్రపంచ జనాభా దినోత్సవం నకు సంబంధించిన బ్యానర్‌ను, గోడ ప్రతులను ఆవిష్కరించినారు .ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ ఏ. వెంకట్రావు డి.టి.సి. ఓ., డాక్టర్ దేవసాగర్ జాయింట్ డైరెక్టర్, ఎన్ .ఎల్ .ఈ .పి .,డాక్టర్ శ్రీలేఖ కంట్రీ కోఆర్డినేటర్ ఫర్ లెప్రసి పాల్గొన్నారు. ఈ సంవత్సరం “తల్లి మరియు బిడ్డ శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్భధారణ మరియు బిడ్డకు బిడ్డకు మధ్య అంతరం” అనే నినాదమును ప్రతిపాదించి ప్రజలలో అవగాహన కల్పించుటకు ప్రభుత్వం వారు నిర్ణయించినారు .ఈ కార్యక్రమం 27 – 6 – 2024 నుండి 24- 7 – 2024 నెలరోజుల పాటు రెండు పక్షోత్సవాలుగా విభజింపబడి నిర్వహించటం జరుగుతుంది. మొదటి పక్షోత్సవంలో కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన ,రెండవ పక్షోత్సవము లో కుటుంబ నియంత్రణ సేవలను అందించుట జరుగుతుంది .ఈ నెల రోజులపాటు క్షేత్ర స్థాయిలో ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనితోపాటు కుటుంబ నియంత్రణ కార్యక్రమములో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మరియు పాటించిన దంపతులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రమును అందించడం జరుగుతుంది. ప్రజలకు ఈ సందర్భంగా అధిక జనాభా వలన కలిగే అటవీ నిర్మూలన, నిరుద్యోగం , వలసలు ,వనరుల కొరత, పేదరికము ,పాండమిక్స్ మరియు ఎప్పుడేమిక్స్, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించుట జరుగునని జిల్లా ఆరోగ్య మరియు విస్తరణ అధికారి బి. శివ శాంబి రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య విద్యా బోధకుడు బి. రాజేంద్ర కుమార్ , జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు మరియు ఎల్సిడిసి నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News