-గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మరియు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం మరియు పురోగతి కోసం ప్రభుత్వం త్వరలో అత్యున్నత కమిటీ ఏర్పాటు చేస్తుంది :ఎం.డి.జాని పాషా రాష్ట్ర అధ్యక్షుడు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్
-సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు శివప్రసాద్ తో సమావేశమై సమస్యలపై చర్చించి వినతిపత్రం అందించిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం,మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం విద్యావంతులైన యువ ఉద్యోగుల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవడానికి,సచివాలయ ఉద్యోగులకు ఉన్నత స్థాయిలో వివిధ అవకాశాలు కల్పించడం ద్వారా సాధ్యం అవుతుందని,అందుకోసం ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకోబోతున్న,గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మాతృ శాఖలకు అప్పగించి మాతృ శాఖలో ఉన్న వివిధ ఖాళీల్లో పదోన్నతులు కల్పించాలని,అలాగే ఒన్ టైం ఆప్షన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలలో పదోన్నతులతో కూడిన అవకాశాలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర సచివాలయాల శాఖ డైరెక్ట్ తో జరిగిన సమావేశంలో చర్చించి వారి ద్రుష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది.
అలాగే సచివాలయ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలైన విధుల్లో చేరిన నాటి నుండి నోష్నల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని,సీనియర్ అసిసిస్టెంట్ పెస్కేల్ కు తగ్గకుండా పదోన్నతులు కల్పించాలని,ఆలస్యంగా ప్రొబేషన్ డిక్లేర్ చేసిన కాలానికి అరియర్స్ చెల్లించాలని,అందరికీ పదోన్నతులు కల్పించాలని,మెరుగైన పరిపాలన అందించడం కోసం ఐదు సంవత్సరాలు గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేసిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ క్రింది స్థాయిలో సచివాలయాలలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టడం ద్వారా ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు రావడంతోపాటు పరిపాలన మెరుగైన స్థాయిలో ఉంటుందని ఆవైపుగా అవకాశం కల్పించాలని కోరడం జరిగింది.జాబ్ చార్ట్ కు సంభందంలేని విధుల నుండి సచివాలయ ఉద్యోగులకు విముక్తి కల్పించాలని,వివిధ కారణాల రిత్యా ఇంకా ప్రొబేషన్ డిక్లేర్ చేయని వారి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని,సచివాలయాల మైంటెనెన్సు కోసం నెలవారీ నిధులు కేటాయించాలని,సర్వీస్ రిజిస్టర్లలో ఎప్పటికప్పుడూ ఉద్యోగుల సెలవులు,ఇంక్రిమెంట్లు మరియు తదితర అంశాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని,మున్సిపాలిటీలుగా మారిన గ్రామాల పరిధిలోని గ్రామసచివాలయ ఉద్యోగులను వార్డు సచివాలయ ఉద్యోగులుగా మార్పు చేయాలని మున్సిపాలిటీలలో కలిసిన వారికి మునిసిపల్ కమీషనర్ ద్వారా జీతాలు చెల్లించాలని,అదేవిధంగా మున్సిపాలిటీ నుండి గ్రామ పంచాయతీలుగా మారిన సచివాలయ ఉద్యోగులకు మండల పరిధిలోని డి.డి.ఒ సెక్రటరీ ద్వారా జీతాలు చెల్లించాలని కోరడం జరిగింది,ఉద్యోగులపై అనవసరమైన పదజాలం ఉపయోగించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని,అన్నీ విభాగాల సచివాలయ ఉద్యోగులకు సంభందించిన అన్నీ సమస్యల పరిష్కారం గురించి చర్చించి వినతిపత్రం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యస్.కె.మహబూబ్ సుభాని,రాష్ట్ర సమన్వయ కర్త ఎం.శశిధర్,రాష్ట్ర సమాచార కార్యదర్శి యన్.రాజేష్ బాబు,యన్.టి.ఆర్ జిల్లా సహఅధ్యక్షులు యు.స్టాలిన్ చక్రవర్తి,కె.రాజ్ కిరణ్,జి.నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News