ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటు గురు పౌర్ణమి ఉత్సవం, మరో వైపు శాకంభరీ మహోత్సవం ముగింపు, అంతక ముందు గిరిప్రదక్షణ సందర్భంగా ఆదివారం విజయవాడలోని ఇంద్ర కీలాద్రిపై భక్త జనం పరవళ్లు తొక్కారు. భారీ వర్షం కురుస్తున్నా.. భక్తులు ఎక్కడా తగ్గలేదు. కొండ చెరియలు విరిగిపడతాయనే ఆందోళనతో ఘాట్రోడ్డునుఅధికారులు మూసివేశారు. అయినా భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. శాకంభరీ ఉత్సవాలో ఆఖరి రోజు ఆదివారం ఉదయం ఆలయ వైదిక సిబ్బంది సప్త శతి హవణం, మహావిద్యా పారాయణం, శాంతి పౌష్టిక హోమం, …
Read More »Daily Archives: July 21, 2024
పెద్దవాగు ముంపు ప్రాంతాలు, గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి, ఆదుకోవాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెద్దవాగు గండిపడి మునిగిపోయిన ప్రాంతాలు, గోదావరి వరద ముంపు ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి, ప్రజానీకాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, డేగ ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య తదితరులతో కూడిన సిపిఐ ప్రతినిధి బృందం పశ్చిమగోదావరి జిల్లా …
Read More »గురు పౌర్ణిమ మహోత్సవంలో చంద్రబాబు ..
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి సి.కె.కన్వెన్షన్ సెంటర్‌లో నేడు శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపౌర్ణమి మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. వేణుదత్తాత్రేయ స్వామి వారి అభిషేకం, పాదుక పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని …
Read More »మాకు న్యాయం చేయండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డిండ్ సోసైటీ చేస్తున్న అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్రీహరిపురం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కో-ఆరేటీవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అదివారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కో-ఆరేటీవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.శ్రీనివాస్, కార్యదర్శి వీరమాచనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ పూర్తైన ఫ్లాట్లకు సొసైటీ వారు …
Read More »గురుపౌర్ణమి మహోత్సవం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రత్యేక పూజలు
చందర్లపాడు మండలం (చింతలపాడు), నేటి పత్రిక ప్రజావార్త : గురుపౌర్ణమి మహోత్సవాన్ని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో శ్రీ నూకేశ్వరి అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ పబ్బతి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఆమె ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు తంగిరాల సౌమ్య గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు. వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల …
Read More »జగన్ రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదు
-తన కార్యకర్త అంటూ భుజాలు ఎగరేసుకుంటూ వెళ్లిన జగన్ బాధిత కుటుంబానికి ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు -జరిగిన రాజకీయ హత్యలు నాలుగు మాత్రమే… అందులో చనిపోయింది ముగ్గురు టీడీపీ కార్యర్తలే అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు ఛీ కొట్టి ఛీత్కరించినా వైసీపీ నేతలు మారడంలేదని… వారి అబద్ధాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని… హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. అధికారం పోవడంతో జగన్ రెడ్డికి బుర్ర దొబ్బి ఎక్కడికెళ్లి ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. అసత్యాలు, అబద్ధాలతో కూటిమి …
Read More »శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం నుండి కనకదుర్గమ్మకు పవిత్ర సారె సమర్పణ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం, వైజాగ్ నుండి ఇంద్రకీలాద్రి పై నున్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను సదరు ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి రాంబాబు మరియు అధికారులు అమ్మవారికి ఆషాడ సారె సమర్పించుటకు విచ్చేయగా వీరికి దుర్గ గుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు …
Read More »ఆంధ్రరత్న భవన్ లో ఖర్గే జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదినం సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అలుపెరుగక కృషి చేస్తున్న శ్రీ ఖర్గే గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురునాధం, నరహరసెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ, ఖుర్షీదా, అన్సారీ, బేగ్ తదితరులు పాల్గొన్నారు.
Read More »సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ “మీకోసం” రద్దు
-ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీలకు సోమవారం సెలవు -జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ “మీకోసం” రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అలాగే మండల, డివిజన్ స్థాయిలో జరగాల్సిన మీకోసం కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీలకు కూడా సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
Read More »38వ డివిజన్ కొండ ప్రాంత బాధితులకు సుజనా చౌదరి ఆర్థిక సాయం
-హర్షం వ్యక్తం చేసిన బాధితులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 38వ డివిజన్ కొట్టేటి కోటయ్య వీధి కొండ ప్రాంతంలో ఆదివారం ఉదయం కొండ చరియలు జారీ పడి పిళ్ళ తులసి అనే గృహిణి గాయాలు పాలైనది. విషయం తెలుసుకున్న పశ్చిమ బిజెపి ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి బాధితులకు అండగా నిలవాలని కోరారు.సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఎన్డీయే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తో కలిసి పిళ్ల తులసీ కుటుంబాన్ని పరామర్శించి …
Read More »