Breaking News

కొత్త ప్రైవేటు స్కూళ్లు స్థాపన & అప్ గ్రేడేషన్ కోసం దరఖాస్తులు స్వీకరణ

-పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు.వి IAS.,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2025-26 విద్యా సంవత్సరమునకు క్రొత్తగా ప్రైవేట్ ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాలల ఏర్పాటు మరియు పాఠశాలల అప్ గ్రేడేషన్ కోసం దరఖాస్తులను డిసెంబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమర్పించాల్సి ఉంటుంది. ఈ తేదీల తర్వాత అందిన దరఖాస్తులు స్వీకరించబడవు. పాఠశాల ఏర్పాటు చేసే సదరు ప్రాంతంలో విద్యార్థుల సంఖ్య మరియు అప్పటికే నడపబడుచున్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను బట్టి మరియు అవసరాన్ని బట్టి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. జనవరి 26, 2025 లోపు కొత్త పాఠశాల అనుమతులు 2025-26 సంవత్సరంకు మంజూరు చేయడం జరుగుతుంది.
ప్రభుత్వ పాఠశాలలు ఏదైనా తరగతి అప్గ్రేడేషన్ చేయడానికి కూడా డిసెంబర్ 31 లోపు దరఖాస్తు సమర్పించాలి.
అనుమతి ప్రక్రియలో భాగంగా, పరిశీలనాధికారులు (ఉప విద్యాశాఖాధికారి మరియు మండల విద్యాశాఖాధికారి) పాఠశాలను సందర్శించి అవసరమైన వివరాలు, విద్యార్థులు సంఖ్యకు అనుగుణంగా పాఠశాల నిబంధనలు మరియు అవసరము ఉందా అనే అంశాన్ని పరిశీలించి ఆ అవసరాన్ని సమర్థిస్తూ Justification report సమర్పించాలి.
అంతేకాకుండా, ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు జిల్లా విద్యాశాఖాధికారులు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల అవసరాన్ని బట్టి తగిన చర్యలు తీసుకోవాలి.
ఈ దరఖాస్తులు ప్రతీ స్థాయిలో 7 రోజుల్లో పరిష్కరించాలని శ్రీ విజయ రామరాజు.వి, ఐఏఎస్, డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి, వారు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *