Breaking News

Daily Archives: July 22, 2024

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 146 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం అర్థవంతంగా చూపాలని, అలసత్వం సహించేది లేదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వారు డిఆర్ఓ …

Read More »

పింక్ బస్ క్యాంపుల్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను తప్పక సదరు షెడ్యూల్ లోని గ్రామ వార్డు ప్రజలు తప్పకుండా వినియోగించు కోవాలి: డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ (బయో) ద్వారా జిల్లాలోని వివిధ పిహెచ్ సిల పరిధిలో నిర్వహిస్తున్న పింక్ బస్ క్యాంపుల్లో మహిళలు, పురుషులు వారి గ్రామ వార్డులకు షెడ్యూల్ మేరకు వచ్చినప్పుడు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత ఎంఎల్హెచ్పీలు ప్రజలకు అవగాహన కల్పించి క్యాంపుకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కోరారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతిలోని కలెక్టర్ ఛాంబర్ నందు స్విమ్స్ బయో ప్రత్యేకాధికారి …

Read More »

ప్రభుత్వం ప్రజల సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రజల సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. సోమవారం మంత్రి మచిలీపట్నం రహదారులు భవనాలు అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా, …

Read More »

కోర్టు కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కోర్టు కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో కౌంటర్ ఫైళ్ళు , అప్పీలు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించి కోర్టు కేసులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఆ వారంలో ఉన్న కోర్టు కేసుల గురించి చర్చించడం జరుగుతుందని, ఏదైనా కోర్టు ఉత్తర్వులు ఉంటే …

Read More »

ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశం మందిరం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక— “మీకోసం కార్యక్రమం” నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను ఎంతో ఓపిగ్గా విని సంబంధిత శాఖల అధికారులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు …

Read More »

మంత్రి కొలుసు పార్థసారథిని కలిసిన ప్రముఖులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మచిలీపట్నం రహదారులు భవనాల అతిధి గృహానికి సోమవారం చేరుకోగా వారిని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా పోలీస్ అధికారి గంగాధర్ రావు జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు ఆర్డిఓ ఎం వాణి హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, సమాచార పౌర సంబంధాల అధికారి ఎం వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఏం పద్మావతి పార్వతి డిఎస్ఓ పార్వతి తదితర …

Read More »

రైతును ఆర్థికంగా నిలబెట్టే ఆయిల్ పామ్ సాగు .. జిల్లా కలెక్టర్

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : ఆయిల్ పామ్ తోటల సాగు రైతును ఆర్థికంగా నిలబెడుతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందగలిగే ఆయిల్ పామ్ సాగు పట్ల రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం మధ్యాహ్నం పామర్రు ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై గ్రామస్థాయి ఉద్యాన, వ్యవసాయ శాఖల సహాయ సిబ్బందికి, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయిల్ పామ్ సాగు …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు నమోదైన 14 ఫిర్యాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో, ఈ సోమవారం 14 ఫిర్యాదులు నమోదయాయని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ మాట్లాడుతూ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత సంబంధిత శాఖాధిపతులు ఆ సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాలు ఇచ్చేటట్టుగా చూడాలని, వచ్చిన ఫిర్యాదు పునరావృతం …

Read More »

సైడ్ డ్రైన్లలో వాటర్ పైప్లైన్లు లేకుండా చూసుకోండి

-ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ తన పర్యటనలో భాగంగా సోమవారం కెటి రోడ్డు, మిల్క్ ప్రాజెక్ట్, లంబాడి పేట, సితార జంక్షన్ నుండి గొల్లపూడి రోడ్డు వరకు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సైడ్ డ్రైన్ లలో మంచినీటి పైపులను పరిశీలించారు. ఇంజనీరింగ్ సిబ్బంది విస్తృతంగా సైడ్ డ్రైనలలో మంచినీటి పైప్లైన్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇంకాను చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, …

Read More »