Breaking News

సైడ్ డ్రైన్లలో వాటర్ పైప్లైన్లు లేకుండా చూసుకోండి

-ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ అధికారులకు ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ తన పర్యటనలో భాగంగా సోమవారం కెటి రోడ్డు, మిల్క్ ప్రాజెక్ట్, లంబాడి పేట, సితార జంక్షన్ నుండి గొల్లపూడి రోడ్డు వరకు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సైడ్ డ్రైన్ లలో మంచినీటి పైపులను పరిశీలించారు. ఇంజనీరింగ్ సిబ్బంది విస్తృతంగా సైడ్ డ్రైనలలో మంచినీటి పైప్లైన్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇంకాను చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, జులై 30 కల్లా ఎట్టి పరిస్థితుల్లో సైడ్ డ్రైనలలో మంచినీటి పైప్లైన్లు ఉండకూడదని, వాటర్ పైప్లైన్లు ఎక్కడ లీకైన, వెంటనే మరమ్మతులు చేయాలని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తాగు నీటీ సర్ఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా మేజర్, మీడియం మైన డ్రైనలలో కూడా పూడికలను ఎప్పటికప్పుడు తీస్తూ, నెలాఖరికల్ల డ్రైనలలో పూడికలు మొత్తం క్లియర్ చేసేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *